Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మను ఆటగాడిగా కూడా ఎంపికచేయాలనుకోలేదు: సెహ్వాగ్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్‌పై ఎలాంటి హింట్ ఇవ్వలేదని, ఇంగ్లండ్ పర్యటనలో ఆడుతాననే చెప్పాడని సెహ్వాగ్ గుర్తు చేశాడు. అయితే సెలెక్టర్ల నిర్ణయంతోనే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు ఆటగాడిగా కూడా టెస్ట్ టీమ్‌లోకి చోటు ఇవ్వకపోవచ్చన్నాడు. రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే. సింపుల్‌గా ఇన్‌స్టా స్టోరీలో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు.

Virender Sehwag says BCCI Might Not Have Even Picked Rohit for England Tour

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్రిక్‌బజ్ ఛానెల్‌లో మాట్లాడిన సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంగ్లండ్ పర్యటనకు రోహిత్ శర్మ సిద్దమవుతున్నట్లు నేను విన్నాను. అతను కూడా ఆస్ట్రేలియా పర్యటనలో చివరి టెస్ట్ తర్వాత కూడా రోహిత్ రిటైర్మెంట్‌పై ఎలాంటి సంకేతం ఇవ్వలేదు. బహుషా సెలెక్టర్లు రోహిత్ శర్మతో మాట్లాడి ఉండొచ్చు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు ఆటగాడిగా కూడా ఇంగ్లండ్ పర్యటనకు అవకాశం లేదని చెప్పి ఉండొచ్చు. దాంతోనే జట్టు ప్రకటనకు ముందే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించి ఉంటాడు. 'అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

రోహిత్ శర్మ గొప్ప ఆటగాడని చెప్పిన సెహ్వాగ్.. మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన కనబర్చాడని కొనియాడాడు. 'రోహిత్ శర్మ గొప్ప ఆటగాడు. మూడు ఫార్మాట్లలో అద్భుతమైన ఆటతో అభిమానులను అలరించాడు. రోహిత్ శర్మ మరికొంత కాలం ఆడి 100 టెస్ట్‌ల మైలురాయిని అందుకోవాల్సింది. కానీ అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. ఏది ఏమైనా రోహిత్ కెరీర్ అద్భుతంగా సాగింది.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్‌లో 67 మ్యాచ్‌లు ఆడి 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెప్టెన్‌గా 24 టెస్టుల్లో భారత్‌కు సారథ్యం వహించి 12 విజయాలు అందించాడు.

Story first published: Thursday, May 8, 2025, 21:34 [IST]
Other articles published on May 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+