Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా బ్యాటింగ్‌కు స్పూర్తి ఆయనే: వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag reveals Ramayans Angad an inspiration behind his batting

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో తనదైన ట్వీట్లతో నవ్వులు పూయిస్తుంటాడు. దేశంలో జరిగే ప్రతీ విషయంపై తనదైన మ్కార్ పంచ్‌తో ఆకర్షిస్తుంటాడు. అయితే తాజాగా తన బ్యాటింగ్‌పై తానే సెటైర్ వేసుకుంటూ ట్వీట్ చేశాడు. తన బ్యాటింగ్‌కు రామాయణానికి ముడిపెడుతూ చేసిన ఈ ట్వీట్.. ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే..? తన బ్యాటింగ్‌కు స్పూర్తి రామాయ‌ణంలోని అంగ‌దుడే‌నని ఈ విధ్యంసకర ఓపెనర్ పేర్కొన్నాడు. క్రీజులో ఉన్నంత సేపు సెహ్వాగ్ పాదాల క‌ద‌ల్చ‌కుండానే షాట్లు ఆడుతాడ‌నే విష‌యం అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని రామాయణానికి ముడిపెట్టిన సెహ్వాగ్.. కాళ్లు క‌ద‌ప‌డం క‌ష్ట‌మే కాదు.. అసాధ్యం కూడా (పైర్ హిలానా ముష్కిల్ హీ న‌హీ.. న మున్‌కిన్ హై) అంటూ రావ‌ణ స‌భ‌లో అంగ‌దుడి ఫొటో ట్వీట్‌ చేశాడు.

టెస్టు క్రికెట్‌లో భార‌త్ త‌ర‌ఫున తొలి ట్రిపుల్ సెంచ‌రీ న‌మోదు చేసిన ఈ న‌జ‌ఫ్‌గ‌ఢ్ న‌వాబ్‌.. కంటికి చేయికి ఉన్న స‌మ‌న్వ‌యంతోనే కాళ్లు క‌ద‌ప‌కుండా భారీ షాట్లు ఆడేవాడు. ఇక రామాయ‌ణం విష‌యానికి వ‌స్తే.. వాలి కుమారుడైన అంగ‌దుడు రామ రావ‌ణ యుద్ధానికి ముందు చివ‌రి రాయ‌బారిగా లంక‌కు వెళ‌తాడు. ఈ సంద‌ర్భంగా స‌భ‌లో జ‌రిగిన మాట‌మాట‌తో.. నేల‌పై ఉన్న త‌న కాలు పైకెత్తాల‌ని ష‌ర‌తు విధిస్తాడు. రావ‌ణ స‌భ‌లోని మ‌హామ‌హులు ప్ర‌య‌త్నించినా అది సాధ్య‌ప‌డ‌దు. ఈ కార‌ణంగానే రామాయ‌ణంలో అంగ‌ద రాయ‌బార ఘ‌ట్టానికి చాల ప్రాముఖ్య‌త వచ్చింది.

ఇక భారత్ తరఫున 251 వన్డేలు ఆడిన సెహ్వాగ్ 8273 పరుగులు చేశాడు. 104 టెస్ట్‌ల్లో 8586 రన్స్ చేశాడు. ఇక టెస్ట్ క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక భారతప్లేయర్‌గా రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇక 19 టీ20లు ఆడిన ఈ డాషింగ్ ఓపెనర్ 394 పరుగులు చేశాడు.

Story first published: Monday, April 13, 2020, 19:46 [IST]
Other articles published on Apr 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+