Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పట్లో డేవిడ్ వార్నర్‌కు ఆ మాట చెబితే నమ్మలేదు: వీరేంద్ర సెహ్వాగ్

ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. కెరీర్‌లో చివరి టెస్ట్ ఆడుతున్న వార్నర్.. ఆరంభంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించే సత్తా ఉందని చెబితే నమ్మలేదని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌తో డేవిడ్ వార్నర్ టెస్ట్ కెరీర్‌కు తెరపడనుంది.

వన్డేలు, టీ20లతో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన డేవిడ్ వార్నర్.. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడే నైపుణ్యం ఉందని సెహ్వాగ్ చెబితే నవ్వుకున్నాడట. తాజాగా ఈ విషయాన్ని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. '2009 ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడేందుకు డేవిడ్ వార్నర్ భారత్‌కు వచ్చాడు.

Virender Sehwag Recalls His Prediction For Retiring David Warner

అప్పుడే టీ20లు, వన్డేలు ఆడటం వార్నర్ మొదలుపెట్టాడు. అతను ఆడే తీరును చూసి టెస్ట్ క్రికెట్ కూడా ఆడగలడనే సామర్థ్యం అతనికి ఉందనిపించింది. కెరీర్ ప్రారంభంలో వార్నర్‌కు ఈ విషయం అర్థం కాలేదు. అప్పుడు తనపై తనకు నమ్మకం కూడా లేదు. ఓ రోజు టీ20 క్రికెట్‌లో బాగా ఆడుతున్న నువ్వు.. టెస్ట్‌ల్లో కూడా రాణించగలవని చెప్పాను.

ఆ మాటతో అతను నవ్వడం ప్రారంభించాడు. టెస్ట్ క్రికెట్‌కు నేను చాలా దూరంగా ఉన్నా. ఆస్ట్రేలియా జట్టులోకి రావాలంటే చాలా కష్టమని అప్పట్లో వార్నర్ బదులిచ్చాడు. నేను వెంటనే ఇదే ఆటతీరును కొనసాగించాలని సూచించాను. టెస్ట్ క్రికెట్ ఆడే సమయం వచ్చినప్పుడు సత్తా చాటుతావని చెప్పాను.

టీ20ల్లో కేవలం 20 ఓవర్లే ఆడాలి. కానీ టెస్ట్‌ల్లో ఎంత సేపైనా బ్యాటింగ్ చేయవచ్చని తెలిపాను. ఆ తర్వాత కొన్నాళ్లకు వార్నర్ టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. నేను చెప్పిన మాటలు గుర్తు పెట్టుకొని ధన్యవాదాలు కూడా చెప్పాడు. టెస్ట్‌ల్లో అతను ఇంకా కొనసాగితే బాగుండేది. కానీ వయసు రీత్యా అతను రిటైర్మెంట్ ప్రకటించినట్లు అర్థమవుతోంది.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, January 5, 2024, 21:56 [IST]
Other articles published on Jan 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+