
సోషల్ మీడియాలో దుమారం..
ఈ గొడవ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా 'క్రీడా స్పూర్తి'అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఓవర్ త్రో విషయంలో పరుగు తీసేటప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలను సవరించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ గొడవ విషయంలో అంతర్జాతీయ మీడియా అశ్విన్‌ను దోషీగా చూపించే ప్రయత్నం చేస్తుండగా భారత ఆటగాళ్లు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించిన సెహ్వాగ్.. ఇయాన్ మోర్గాన్‌పై సెటైర్లు పేల్చాడు. ప్రపంచకప్ ఫైనల్లో బెన్ స్టోక్స్ బ్యాట్ తగిలి వచ్చిన ఎక్స్‌ట్రా రన్స్ తీసుకోకుండా డగౌట్‌లో ధర్నా చేయాల్సిందన్నాడు.

ధోనీ తిట్టాడు..
తాజాగా క్రిక్ బజ్ చానెల్‌లో ఈ గొడవపై చర్చించిన సెహ్వాగ్.. 2014 ఐపీఎల్ సీజన్ నాటి ఓ ఘటనను గుర్తు చేసుకున్నాడు. 'నేను పంజాబ్ కింగ్స్‌కు ఆడే సమయంలో చెన్నైతో జరిగిన ఓ మ్యాచ్‌లో అశ్విన్ చాలా దురుసుగా ప్రవర్తించాడు. అప్పటి నా సహచర బ్యాట్స్‌మన్ గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేసి అతన్ని దూషించాడు. అది నాకు ఏ మాత్రం నచ్చలేదు. కానీ ఇప్పటి వరకు ఆ విషయాన్ని ఎక్కడా బహిరంగంగా ప్రస్తావించలేదు. అశ్విన్ తప్పు చేశాడని కానీ, క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడని కూడా చెప్పలేదు. కానీ అశ్విన్‌ను ధోనీ మందలించాడు. ప్రత్యర్థి ఆటగాడి తప్పులేకున్నా అతన్ని అనవసరంగా దూషించడం సరి కాదని ధోనీ కొప్పడ్డాడు. క్రీడాస్పూర్తి అంటే అది.. ధోని ఈ విషయంలో ఎప్పుడు ముందుంటాడు.

బయటకు చెప్పడం ఎందుకు?
అప్పుడు గనుక నేను అశ్విన్- మ్యాక్స్‌వెల్ గొడవను సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. మైదానంలో జరిగిన వివాదం గురించి మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడినా.. సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించినా అది పెద్ద వివాదం అవుతోంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఆటగాళ్లు కొంచెం సమన్వయం పాటించాలి. మైదానంలో జరిగిన చిన్నపాటి వివాదాల గురించి బయటకి చెప్పవద్దు. అశ్విన్- మోర్గాన్ వివాదాన్ని కూడా అనవసరంగా పెద్దది చేశారు.'సెహ్వాగ్.. దినేశ్ కార్తీక్ పేరును ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.

నిబంధనలు మార్చాలి..
ఈ గొడవపై భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ సహాయక కోచ్ మహమ్మద్ కైఫ్ స్పందిస్తూ నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉందన్నాడు. క్రీజులో పరుగు తీసేటప్పుడు ఫీల్డర్ విసిరిన ఓవర్‌త్రో సహచర బ్యాట్స్‌మన్‌కు తాకిందా? లేదా అని గ్రహించడం కష్టమవుతుందని, కాబట్టి ఈ విషయంలో నిబంధనలను సవరించాలన్నాడు. ఫీల్డర్ విసిరిన బంతి బ్యాట్స్‌మెన్‌కు తాకితే ఆ బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించాలన్నాడు. ఈ రూల్స్ అర్థం చేసుకోవడం గందరగొళంగా ఉందని, ఐసీసీ, మెరిలీన్ క్రికెట్ బోర్డు సభ్యులు ఈ విషయంపై చర్చించాలని కైఫ్ సూచించాడు.

క్లారిటీ ఇచ్చిన అశ్విన్..
ఈ ఘటన మీద అశ్విన్ ఓ క్లారిటీ ఇచ్చాడు. దీనికోసం ఓ సుదీర్ఘమైన ట్వీట్‌ను అతను తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు. అక్కడ చోటు చేసుకున్న ఉదంతాన్నినాలుగు ప్రశ్నలుగా విభజించాడు. వాటిని తానే సమాధానాలను ఇచ్చుకున్నాడు. డీప్ నుంచి కేకేఆర్ ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి విసిరిన బంతికి ఎక్స్‌ట్రా రన్ తీయబోయాడు అశ్విన్. దీన్ని మోర్గాన్ తప్పు పట్టాడు. డిస్ గ్రేస్ అంటూ కామెంట్ చేశాడు. ఎంసీసీ రూపొందించిన నిబంధనలకు ఇది విరుద్ధమని, స్పిరిట్ ఆఫ్ క్రికెట్‌కు విరుద్ధమని పేర్కొన్నాడు.
దీనికి అశ్విన్ వివరణ ఇచ్చాడు. త్రిపాఠి విసిరిన బంతి రిషభ్ పంత్‌కు తగిలిందా? లేదా? అనేది తనకు తెలియదని, రన్ తీయడానికి మాత్రమే తాను ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు. ఆ బంతిని తాను చూసి ఉంటే రన్ కోసం ప్రయత్నించి ఉండే వాడిననీ అన్నాడు. మోర్గాన్ చేసిన కామెంట్స్‌తో తాను ఏకీభవించట్లేదని పేర్కొన్నాడు. తాను వారితో ఘర్షణ పడలేదని, తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పిన విధంగా.. తనకు తానుగా ఆత్మగౌరవం కోసం వారికి ఎదురుగా నిల్చున్నానని చెప్పాడు.


Click it and Unblock the Notifications
