చాహల్.. నిన్ను చంపే ప్రయత్నం చేసిన ఆ ప్లేయర్ పేరు చెప్పు: వీరేంద్ర సెహ్వాగ్


న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు. 2013 ఐపీఎల్ సీజన్‌లో ఓ ఆర్‌సీబీ ప్లేయర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తు బాల్కానీలో వేలాడదీసాడని తెలిపాడు. ఏ తప్పిదం జరిగినా తాను అక్కడి నుంచి కిందపడి ప్రాణాలు కోల్పేయేవాడినని సంచలన విషయాన్ని వెల్లడించాడు. అయితే ఆ ప్లేయర్ ఎవరా? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక చాహల్ వెల్లడించిన షాకింగ్ ఘటనపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వగ్ స్పందించాడు.

ఆ ప్లేయర్ పేరు చెప్పాలి..
అతని పేరు చెప్పాలని, అది సరదాగా చేసిన పని కాదని, సదరు ఆటగాడిపై తీసుకున్న చర్యలు ఏంటనే విషయం తెలియాలని సోషల్ మీడియా వేదికగా సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. 'తాగిన మైకంలో చాహల్‌ను బాల్కనీలో వేలాడదీసిన ఆటగాడి పేరు వెల్లడించాలి. చాహల్ చెప్పింది నిజమైతే అది ఏ మాత్రం సరదాగా చేసిన పని కాదు. అసలేం జరిగిందనే విషయం తెలవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా సదరు ఆటగాడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అనే విషయం కూడా తెలియాలి'అని సెహ్వాగ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రశ్నించాడు.

అతిగా మద్యం తాగి..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ ఆర్‌సీబీ ప్లేయర్ కారణంగా 2013లో ఒకసారి తన వెన్నులో వణుకు పుట్టిందని చాహల్ చెప్పుకొచ్చాడు. 'ఈ స్టోరీని ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదు. ఎక్కడా షేర్ చేసుకోలేదు. 2013లో ఈ ఘటన జరిగింది. అప్పట్లో నేను ముంబై ఇండియన్స్ జట్టుకి ఆడేవాడ్ని. ఆ ఏడాది బెంగళూరుతో మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్లకీ గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. అందులో ఆర్‌సీబీ ప్లేయర్ ఒకరు అతిగా మద్యం సేవించాడు. నేను అతని పేరు చెప్పను. కానీ.. ఆ రోజు అతను మితిమీరి మద్యం తాగాడు.

15వ అంతస్తు నుంచి వేలాడదీసాడు..
పార్టీ ముగిసిన తర్వాత అతను నా వైపు చాలాసేపు చూసి.. దగ్గరికి రమ్మని పిలిచాడు. నేను వెళ్లగానే అతను నన్ను అమాంతం పైకి ఎత్తుకుని.. బాల్కానీ వద్దకి తీసుకెళ్లి వేలాడదీశాడు. దాంతో.. బిత్తరపోయిన నేను నా చేతుల్ని అతని మెడ చుట్టూ వేసి పట్టుకున్నాను. అప్పుడు మేము 15వ ప్లోర్‌లో ఉన్నాం. నేను కొద్ది కొద్దిగా పట్టు కోల్పోతున్నాను. అయితే.. అదే సమయంలో నా కేకలు విని అక్కడే ఉన్న కొందరు వచ్చి నన్ను పట్టుకుని.. రక్షించారు.

ఏ తప్పిదం జరిగినా..
ఊహించని ఘటనతో నేను స్పృహ కోల్పోయాను. అక్కడ ఉన్న వాళ్లు వాటర్ ఇచ్చారు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అప్పుడే నాకు అర్థమైంది. కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నా. ఏ చిన్న తప్పిదం జరిగి ఉన్నా? నేను 15వ అంతస్తు నుంచి కింద పడిపోయేవాడ్ని'' అని చాహల్ గుర్తు చేసుకున్నాడు. అయితే చాహల్‌ను అలా భయపెట్టింది యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ అయ్యుంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications