రోహిత్ శర్మలా విరాట్ కోహ్లీకి విశ్రాంతినిస్తారా? టీమ్‌మేనేజ్‌మెంట్‌పై సెహ్వాగ్ ఫైర్

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన ఫస్ట్ టీ20లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను పక్కనపెట్టడంపై మాజీ క్రికెటర్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభమయ్యే వరకు రోహిత్ జట్టులో ఉంటాడని భావించిన అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా రోహిత్‌కు తొలి రెండు టీ20ల్లో విశ్రాంతినిచ్చామని టాస్ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ ఊహించని పరిణామంతో అంతా అవాక్కయ్యారు.
ఇక రోహిత్ గైర్హాజరీతో బరిలోకి దిగిన భారత్ తగిన మూల్యం చెల్లించుకుంది. టాపార్డర్ దారుణంగా విఫలమైంది. కేఎల్ రాహుల్(1), విరాట్ కోహ్లీ(0), శిఖర్ ధావన్(4) ముగ్గురు కలిసి కేవలం 5 పరుగులు మాత్రమే చేశారు. దాంతో భారత్ స్వల్ప స్కోర్‌కే పరిమితమై 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అయితే రోహిత్‌ను పక్కనపెట్టడంతో భారత్ ఓటమి పాలైందని మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, అజయ్ జడేజా మండిపడ్డారు.

విరాట్‌కు విశ్రాంతినిస్తారా?
రోహిత్ శర్మలా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా విశ్రాంతినిస్తారా? ఈ రొటేషన్ పాలసీ రూల్ కెప్టెన్‌కు వర్తిస్తుందా? అని క్రిక్‌బజ్‌షోలో సెహ్వాగ్ ప్రశ్నించాడు. 'తొలి రెండు టీ20ల నుంచి రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. మరీ ఈ రూల్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా వర్తిస్తుందా? ఓ కెప్టెన్‌గా అతను ముందుకొచ్చి నాకు విశ్రాంతి కావాలని అడుగుతాడని నేను అనుకోవడం లేదు. విరాట్ కోహ్లీ తనకు తాను విశ్రాంతి తీసుకున్నట్లు కూడా నాకు గుర్తు లేదు. కెప్టెనే విశ్రాంతి తీసుకోనప్పుడు మరీ ఇతరులకు ఎందుకు బ్రేక్ ఇస్తున్నారు?'అని సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఫామ్‌లో ఉన్న రోహిత్..
టెస్ట్ సిరీస్‌లో రోహిత్ అద్భుతంగా రాణించాడు. పైగా అతనే టాప్ స్కోరర్. మంచి టచ్‌లో ఉన్నాడు. అలాంటి ఆటగాడని పక్కన పెట్టడం ఏ మాత్రం బాలేదు. టెస్ట్ క్రికెట్ అద్భుతంగా రాణించిన రోహిత్.. టీ20లోనూ అదరగొట్టేవాడు. సంప్రదాయక ఫార్మాట్‌లో లేని స్వేచ్చ పొట్టి క్రికెట్‌లో ఉంటుంది. ఫోర్స్, సిక్స్‌లతో ప్రేక్షకులను అలరించేవాడు. అయితే రోహిత్ రీఎంట్రీ ఇవ్వగానే కోహ్లీ రెస్ట్ తీసుకుంటాడా? అనేదే నా ప్రశ్న. రోహిత్, ఇషాంత్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా ఇలా ఎవరికైనా విశ్రాంతి ఇవ్వాలనుకున్నప్పుడు అది నీకు(కోహ్లీ) వర్తిస్తుందని గుర్తుంచుకో'అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

ఇంగ్లండ్ చేసిన తప్పే..
ఫామ్‌లో ఉన్న ఏ బ్యాట్స్‌మన్‌కు విశ్రాంతి తీసుకోవాలని ఉండదని మాజీ క్రికెటర్ అజేయ్ జడేజా అన్నాడు. 'ఫామ్‌లో ఉన్న ఏ బ్యాట్స్‌మెన్‌కు విశ్రాంతి తీసుకోవాలని ఉండదు. ఈ ఆట పరుగులు, రిథమ్ మీదే నడుస్తుంది. అలాంటప్పుడు ఎవరైనా ఫామ్‌ను కొనసాగిస్తూ మరిన్ని పరుగులు చేయాలనుకుంటారు. ఇక ఇంగ్లండ్ కూడా టెస్ట్ సిరీస్‌లో ఇలానే రొటేషన్ పాలసీ పేరిట ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను పక్కనబెట్టి మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు భారత్ అదే చేస్తుంది'అని జడేజా విమర్శంచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications