Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: గతంలో కూడా ఇలాగే జరిగింది.. జార్ఖండ్‌ నుంచి వచ్చిన ఓ యువ కీపర్..‌: సెహ్వాగ్‌

Virender Sehwag praises Ishan Kishan and compares to MS Dhoni

ఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20తో టీమిండియా యువ బ్యాట్స్‌‌మన్‌ ఇషాన్‌ కిషన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ‌విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించి (56; 32 బంతుల్లో 5x4, 4x6) హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (73; 49 బంతుల్లో 5x4, 3x6)తో కలిసి రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించాడు. దాంతో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇషాన్‌ కిషన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీలు అందరూ పొగుడుతూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

గతంలో కూడా ఇలాగే జరిగింది

గతంలో కూడా ఇలాగే జరిగింది

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీతో పోలిక తెస్తూ మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌.. ఇషాన్ కిషన్‌‌ను ప్రశంసించాడు. 'జార్ఖండ్‌ నుంచి వచ్చిన ఓ యువ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ తన సామర్థ్యమేమిటో నిరూపించుకున్నాడు. గతంలో కూడా ఇలాగే జరిగింది (ఎంఎస్ ధోనీని ఉద్దేశించి). ఏమాత్రం బెదురు లేకుండా ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌ చేసిన తీరు ఎంతగానో నచ్చింది' అని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. మహీ స్వస్థలం జార్ఖండ్‌ అన్న సంగతి తెలిసిందే. ఇక దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్‌ జార్ఖండ్‌కు ఆడుతున్నాడు. అందుకే వీరూ ఇలా ట్వీట్ చేశాడు.

ఏమాత్రం తడబడకుండా

ఏమాత్రం తడబడకుండా

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్ కూడా ఇషాన్‌ కిషన్‌పై ప్రశంసలు కురిపించాడు. 'అరంగేట్ర మ్యాచ్‌లోనే ఏమాత్రం తడబడకుండా ఇషాన్‌ కిషన్‌ ఆడిన తీరు అద్భుతం. ఐపీఎల్‌లో ఆడిన అనుభవాన్ని ఉపయోగించుకుని అంతర్జాతీయ మ్యాచ్‌లో తనను తాను ఆవిష్కరించుకున్నాడు. అలాగే కెప్టెన్‌ విరాట్ కోహ్లీ కూడా తనదైన క్లాసిక్‌ ఆటతో ఫాంలోకి వచ్చాడు' అని యూవీ పేర్కొన్నాడు. మాజీ టెస్టు స్పెషలిస్టు వీవీఎస్‌ లక్ష్మణ్‌, మాజీ పేసర్ ఇర్ఫాన్‌ పఠాన్‌, మాజీ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ కైఫ్‌, మాజీ పేసర్ ఆర్పీ సింగ్‌ తదితరులు ఇషాన్‌ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.

అరుదైన రికార్డు

అరుదైన రికార్డు

రెండో టీ20లో 22 ఏళ్ల ఇషాన్‌ కిషాన్‌ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అరంగేట్రం టీ20 మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా ఇషాన్‌ రికార్డుల్లోకి ఎక్కాడు‌. అరంగేట్రంలో అర్ధ సెంచరీ సాధించిన తొలి రికార్డు టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే పేరుపై ఉంది. 2011లో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లండ్‌పై రహానే 61 పరుగులు చేశాడు. రహానే 39 బంతుల్లో ఎనిమిది బౌండరీలతో 61 పరుగులు చేశాడు. రెండో టీ20లో 28 బంతుల్లో ఫిఫ్టీ బాదిన కిషన్.. అరంగేట్రంలో అర్ధ సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

నాలుగో క్రికెటర్‌గా

నాలుగో క్రికెటర్‌గా

అద్భుత ఆటతో అదరగొట్టిన ఇషాన్‌ కిషాన్.. మరో రికార్డు కూడా నెలకొల్పాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు అందుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా ఇషాన్‌ నిలిచాడు. గతంలో పేసర్ మోహిత్‌ శర్మ (2013లో జింబాబ్వేపై), ఓపెనర్ పృథ్వీ షా (2018లో వెస్టిండీస్‌పై), పేస్ బౌలర్ నవదీప్‌ సైనీ (2019లో వెస్టిండీస్‌పై) అరంగేట్రం మ్యాచ్‌లోనే 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో సీనియర్ శిఖర్ ధావన్ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఆడాడు.

బౌండరీ అవతల కాలు పెట్టాడు.. ప్రత్యర్థి జట్టును మోసం చేశాడు! చివరకు దొరికిపోయాడు!

Story first published: Monday, March 15, 2021, 14:24 [IST]
Other articles published on Mar 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+