టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీ అద్బుతమైన బ్యాటర్ అని, దేశం కోసం ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడని కొనియాడాడు. సచిన్ టెండూల్కర్ తనకు రోల్ మోడల్ అని చెప్పిన సెహ్వాగ్.. ఛేజింగ్‌లో మాత్రం సచిన్ కంటే కోహ్లీనే గొప్ప అని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భార్‌త్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్ విధించిన 229 పరుగుల లక్ష్యాన్ని 46.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని టీమిండియా 35 ఓవర్లలోనే పూర్తి చేస్తుందని భావించానని సెహ్వాగ్ తెలిపాడు. ఈ టార్గెట్ ఛేజింగ్ విషయంలో ఏ మాత్రం కంగారు పడలేదని తెలిపాడు. తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడిన సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

సచిన్ కంటే కోహ్లీనే గొప్ప..
'ప్రతీ ఆటగాడి ఫేవరేట్, నా రోల్ మోడల్ సచిన్ టెండూల్కర్. అతనితో కలిసి మైదానంలో అడుగుపెడుతుంటే సింహంతో అడవిలోకి వెళ్తున్నట్లు ఉండేది. ప్రతీ ఒక్కరు సచిన్‌ను చూసేవారు. అప్పుడు నేను నిశ్శబ్దంగా పరుగులు చేసేవాడిని. అయితే, లక్ష్య చేధనలో మాత్రం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలో ఎవరు అంటే మాత్రం నేను కోహ్లీవైపే మొగ్గు చూపిస్తాను. 2011-12 నుంచి ఇప్పటి వరకు కోహ్లీ చాలా మారిపోయాడు. ముఖ్యంగా అతని ఫిట్‌నెస్, ఆటలో నిలకడ అద్భుతం. దేశం కోసం ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.
బంగ్లాదేశ్‌కు భయమా?
భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో నేను ఏ దేశలో కంగారు పడలేదు. ఎందుకంటే ప్రత్యర్థి బంగ్లాదేశ్. నేను ఆడే సమయంలోనే బంగ్లాదేశ్‌ను చూసి ఎప్పుడూ భయపడలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా టెన్షన్ పడుతాను. అసాధారణ ప్రదర్శన చేయడానికి బంగ్లాదేశ్ ఏమైనా పాకిస్థానా? ఆస్ట్రేలియానా? మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయినా సరే ఇబ్బందేమి లేదు. అయితే చాలా తేలికగా విజయం సాధించాల్సిన మ్యాచ్. రోహిత్, విరాట్, శ్రేయస్ అయ్యర్‌లో ఒకరు క్రీజులో ఉండుంటే భారత్ 35 ఓవర్లలోనే మ్యాచ్ ముగించేది.'అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.