Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌ను నేనే కాపాడా: సెహ్వాగ్ ట్వీట్, గేల్ ఏమన్నాడో తెలుసా?

Virender Sehwag Makes Hilarious Claim About Saving IPL 2018, Chris Gayle Concurs

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి పంజాబ్-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 178/4కే పరిమితమైంది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

దీంతో సన్‌రైజర్స్‌పై పంజాబ్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 63 బంతుల్లో 11 సిక్సులు, ఒక ఫోర్‌ సాయంతో 104 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఐపీఎల్‌లో తాను ఎంత విలువైన ఆటగాడినో అని మిగతా ఫ్రాంచైజీలకు తెలియజేశాడు.

మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న క్రిస్ గేల్ మాట్లాడుతూ 'చాలా మంది నేను ముసలివాడినైపోయానని అనుకున్నారు. ఈ ఇన్నింగ్స్ తర్వాత నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. ఈ సెంచరీ నా కూతురికి అంకితం. శుక్రవారం ఆమె బర్త్‌డే. నేను కింగ్స్ పంజాబ్ జట్టులో చేరినప్పటి నుంచీ సెహ్వాగ్ నాకు ఒకటే చెబుతున్నాడు. యోగా, మసాజ్ చేసే వ్యక్తులతోనే ఎక్కువగా గడపమని. నా సక్సెస్‌కు అదే కారణం అనుకుంటా' అని నవ్వుతూ చెప్పాడు.

ఐపీఎల్‌లో నేనేదో నిరూపించుకోవాలని చాలా మంది అన్నారు. అయితే, 'సెహ్వాగ్ తనను ఎంపిక చేసుకొని ఐపీఎల్‌ను కాపాడాడు' అని అన్నాడు. ఈ మాటను సీరియస్‌గా తీసుకున్న సెహ్వాగ్ ఆ తర్వాత ఓ ట్వీట్ చేశాడు. 'నేను ఐపీఎల్‌ను కాపాడాను' అంటూ వీరూ చేసిన ట్వీట్‌పై 'అవును' అంటూ గేల్ మరో ట్వీట్ చేశాడు.

ఐపీఎల్‌తోపాటు టీ20ల్లో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులు అతని పేరు మీద ఉన్నా.. ఫ్రాంచైజీలు మాత్రం అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. దీంతో చివరికి కింగ్స్ పంజాబ్ ముందుకు వచ్చి రూ. 2 కోట్లు పెట్టి అతన్ని సొంతం చేసుకుంది. గేల్‌ను ఆ మాత్రం పెట్టినందుకు అతడు రెండు మ్యాచ్‌లు గెలిపించినా చాలని సెహ్వాగ్ అప్పట్లో అన్నాడు.

సెహ్వాగ్ అన్న మాటలను క్రిస్ గేల్ నిలబెట్టుకున్నాడు. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడని గేల్... చెన్నైతో మ్యాచ్‌లో జట్టులోకి వచ్చీ రాగానే 33 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్‌లో క్రిస్ గేల్‌దే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ రెండు మ్యాచుల్లో కింగ్స్ పంజాబ్ గెలిచింది.

Story first published: Friday, April 20, 2018, 13:29 [IST]
Other articles published on Apr 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+