కరోనా​ బాధితులకు అండగా 'సెహ్వాగ్​ ఫౌండేషన్​'

Virender Sehwag Foundation Serves Free Food To 51,000 People || Oneindia Telugu

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి‌ బాధితులకు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అండగా నిలిచాడు. తన పేరిట ఓ ఫౌండేషన్ స్థాపించి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇంట్లో వండిన ఆహారాన్ని కోవిడి బాధితులకు అందజేస్తున్నాడు. ఈ విషయాన్ని సెహ్వాగ్ ఫౌండేషన్ గత నెల 25నే ట్విటర్ వేదికగా ప్రకటించింది.

ఇప్పటివరకు 51వేలకు పైగా కరోనా బాధితులకు ఆహారాన్ని ఉచితంగా అందించినట్లు ఫౌండేషన్ తాజా ట్వీట్‌లో వెల్లడించింది. దీంతో పాటు ఆక్సిజన్​ కాన్సంట్రేటర్ల ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్లు పేర్కొంది.

ఇంకా ఎవరైనా బాధితులు అన్నం లేక అలమటించినట్లయితే తమను సంప్రదించాలని కోరింది. తమకు సహాయం చేయాలనుకున్న వారు virenderfoundation84@upiకి విరాళాలు అందించాలని తెలిపింది. కోవిడ్‌పై జరుగుతున్న పోరాటంలో క్రీడాకారులంతా భాగస్వామ్యులవుతున్నారు. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ రూ.2 కోట్ల విరాళంతో పాటు ఫండ్ రైజింగ్ క్యాంపైన్ చేపట్టారు.

శిఖర్ ధావన్​, యుజ్వేంద్ర చాహల్, రిషభ్ పంత్, జయదేవ్​ ఉనద్కత్, ప్యాట్ కమిన్స్ తదితర ఆటగాళ్లు తమకు తోచిన సాయాన్ని అందించారు. కరోనా కష్ట కాలంలో మరో మాజీ క్రికెటర్​, ఎంపీ గౌతమ్​ గంభీర్​.. ప్రజలకు సాయం చేస్తున్నాడు. ప్రజలకు ఫాబి ఫ్లూ టాబ్లెట్లను ఉచితంగా పంచుతున్నాడు. సచిన్ టెండూల్కర్ సైతం తన వంతు సాయాన్ని ప్రకటించాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, May 16, 2021, 11:39 [IST]
Other articles published on May 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X