For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: కెప్టెన్ సంగతి తెలియదు కానీ.. కోల్‌కతా అతడిని మాత్రం రిటైన్‌ చేసుకుంటుంది: సెహ్వాగ్

Virender Sehwag feels Kolkata Knight Riders might retain Venkatesh Iyer for IPL 2022
IPL 2022 : KKR Will Retain Him Definitely For Next Season - Virender Sehwag || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)14వ సీజన్ ట్రోఫీ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ దశల్లో అద్భుత ఆటతీరుతో ఫైనల్‌ చేరిన ఇరు జట్లు కీలక పోరాటానికి సిద్ధమయ్యాయి. ఐపీఎల్‌ టోర్నీలో ఇప్పటివరకు మూడుసార్లు ట్రోఫీ నెగ్గిన సీఎస్‌కే.. రెండు సార్లు కప్పు ముద్దాడిన కేకేఆర్ జట్లు మరో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాయి. ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ శుక్రవారం దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. దేశమంతా దసరా పండుగ జరుపుకుంటున్న వేళ ఐపీఎల్‌ 2021 ఫైనల్‌ పోరు అభిమానులను అలరించబోతున్నది.

అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్

అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్

ఐపీఎల్ 2021 సీజన్‌ తొలి అంచెలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పేలవ ప్రదర్శన కనబరిచింది. భారత్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. దీంతో కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు చేరడం కష్టమే అని అందరూ భావించారు. కానీ యూఏఈలో జరుగుతున్న రెండో అంచెలో మోర్గాన్ సేన దశ పూర్తిగా తిరిగిపోయింది. అక్కడ ఆడిన ఏడు లీగ్‌ మ్యాచ్‌ల్లో ఐదు విజయాలను నమోదు చేసుకుని 14 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

ముంబై ఇండియన్స్ కూడా 14 పాయింట్లతో ఉన్నా.. నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో మోర్గాన్ సేన అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌ చేరింది. ఎలిమినేటర్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన క్వాలిఫయర్‌-2లో దాదాపు ఓటమి అంచన నిలిచిన కోల్‌కతా.. ఊహించని విజయాన్ని అందుకుని ఫైనల్ చేరింది.

కోల్‌కతా విజయాల్లో కీలకపాత్ర

కోల్‌కతా విజయాల్లో కీలకపాత్ర

అయితే రెండో అంచెలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టులో సాధించిన విజయాల్లో ఒక ఆటగాడు కీలకపాత్ర పోషించాడు. అతడే మధ్యప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్‌ వెంకటేశ్ అయ్యర్‌. యూఏఈలో ఆడిన మొదటి మ్యాచులోనే అతడు చెలరేగాడు. దాంతో వరుస అవకాశాలు దక్కించుకుని జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి వెంకీ అద్భుత ఆరంభాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీతో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు.

అంతేకాదు పార్ట్‌టైం బౌలర్‌గా, ఫీల్డర్‌గానూ జట్టుకు బాగా ఉపయోగపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అయ్యర్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సీజన్‌లో వెలుగులోకి ఆటగాళ్లలో వెంకటేశ్ ఒకరని నిస్సందేహంగా చెప్పొచ్చన్నాడు. కోల్‌కతా ఫైనల్స్‌కు చేరడానికి ఇతను కూడా కారణం అని పేర్కొన్నాడు.

పోటీ దారులలో ఒకడిగా ఉంటాడు

పోటీ దారులలో ఒకడిగా ఉంటాడు

తాజాగా వీరేంద్ర సెహ్వాగ్‌ ఓ క్రీడా ఛానెల్‌లో మాట్లాడుతూ... 'ఈ సీజన్‌లో వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో వెంకటేశ్‌ అయ్యర్ ఒకరని నిస్సందేహంగా చెప్పొచ్చు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పుంజుకోవడంలో ఈ ఆటగాడిది కీలకపాత్ర. జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తున్నాడు. భారత జట్టు యాజమాన్యం,సెలెక్టర్లు ఇతని ప్రదర్శనను చూసి.. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్‌ కోసం యూఏఈలోనే ఉండాలని కోరారు.

ఒకవేళ ఎవరైనా గాయపడితే లేదా హార్దిక్‌ పాండ్యాకు ఏదైనా ఇబ్బంది ఉంటే అతడు జట్టులోకి రావొచ్చు. ఐపీఎల్ 2022 కోసం మెగా వేలం జరగనుంది. కోల్‌కతా కొంతమంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకోవాలనుకుంటే.. వెంకటేశ్‌ కూడా పోటీ దారులలో ఒకడిగా ఉంటాడు. కెప్టెన్ సంగతి తెలియదు కానీ.. అయ్యర్‌ని కేకేఆర్‌ రిటైన్‌ చేసుకుంటుందని భావిస్తున్నా' అని చెప్పాడు.

IPL 2021 Final: కలవరపెడుతున్న మోర్గాన్ ఫామ్.. షకిబ్ డౌటే! చెన్నైతో తలపడే కోల్‌కతా జట్టు ఇదే!!

చదువును కొనసాగిస్తూనే

చదువును కొనసాగిస్తూనే

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వెంకటేశ్‌ అయ్యర్ 2015 నుంచి రాష్ట్ర స్థాయి జట్టులో కొనసాగుతున్నాడు. అదే సమయంలో ఎంబీఏ పూర్తి చేశాడు. అంతకుముందు ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అవ్వాలని ఆశించిన అతడు.. ఆ కోర్సులో చేరితే క్రికెట్‌కు దూరమవ్వాల్సి వస్తుందని ఆలోచించాడు. దీంతో ఎంబీఏలో చేరాడు. మెరిట్‌ విద్యార్థి అయిన అతడు.. తనపై ఉన్న ఆత్మవిశ్వాసంతో తరగతులకు కూడా ఎక్కువగా హాజరయ్యేవాడు.

ఈ క్రమంలోనే వెంకటేశ్‌ ఆట చూసి ఫిదా అయిన అధ్యాపకులు అతడికి సాయం చేశారు. నోట్సు తయారు చేసివ్వడం, అటెండెన్స్‌ నష్టపోకుండా చూడటం లాంటివి చేశారు. దీంతో మిగిలిన సమయమంతా ప్రాక్టీస్‌కే కేటాయించిన వెంకటేశ్‌.. క్రికెట్‌లో మంచి ఆల్‌రౌండర్‌గా తయారయ్యాడు. అలా చదువును కొనసాగిస్తూనే క్రికెటర్‌గా ఎదిగాడు.

 డెలాయిట్‌లో ఉద్యోగం వదులుకుని

డెలాయిట్‌లో ఉద్యోగం వదులుకుని

26 ఏళ్ల వెంకటేశ్‌ అయ్యర్ ఎంబీయే పూర్తి చేశాక డెలాయిట్‌ సంస్థలో మంచి ఉద్యోగం సంపాదించాడు. అయినా దాన్ని వదులుకొని క్రికెటర్‌గా కొనసాగేందుకే సిద్ధపడ్డాడు. అదే సమయంలో 2018లో తొలిసారి ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌గా ఎంపికై దాదాపు మూడేళ్లు ఎంతో కష్టపడ్డాడు. మధ్యప్రదేశ్‌ జట్టులో అండర్‌ 23 జట్టుకు కెప్టెన్‌గానూ పని చేశాడు.

ఈ క్రమంలోనే తన ఆటను మెరుగుపర్చుకొని ఐపీఎల్ 2020లో తొలిసారి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఎంపికయ్యాడు. అయితే అతడికి ఆ సీజన్‌లో ఆడే అవకాశాలు రాలేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ వేలానికి ముందు వెంకటేశ్‌.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే టోర్నీల్లో చెలరేగాడు.

తొలుత సయ్యద్‌ ముస్తాక్‌ టోర్నీలో ఐదు మ్యాచ్‌ల్లో 75.66 సగటుతో 277 పరుగులు చేసి టాప్‌లో నిలిచాడు. విజయ్‌ హజారేలో పంజాబ్‌పై 198 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ఎంపియ్యాడు. తొలి దశలో ఆడే అవకాశం రాకున్నా.. రెండో దశలో అదృష్టం వరించి హీరో అయ్యాడు.

Story first published: Friday, October 15, 2021, 8:59 [IST]
Other articles published on Oct 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+