For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 Final: కలవరపెడుతున్న మోర్గాన్ ఫామ్.. షకిబ్ డౌటే! చెన్నైతో తలపడే కోల్‌కతా జట్టు ఇదే!!

KKR Playing XI vs CSK: Andre Russell in and Shakib Al Hasan out for IPL 2021 Final

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య దుబాయ్ వేదికగా ఈరోజు (అక్టోబర్ 15) రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ఆరంభం కానుంనుండగా.. టాస్ 7 గంటలకు పడనుంది. క్వాలిఫయర్-1లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై గెలిచిన చెన్నై నేరుగా ఫైనల్‌కి చేరింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌ని ఎలిమినేటర్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్‌ని క్వాలిఫయర్-2లో ఓడించిన కోల్‌కతా ఫైనల్‌కి అర్హత సాధించింది. దేశమంతా దసరా పండుగ జరుపుకుంటున్న వేళ ఐపీఎల్‌ 2021 ఫైనల్‌ పోరు అభిమానులను అలరించబోతున్నది. దిగ్గజ ఎంఎస్ ధోనీ మ్యాజిక్‌ పనిచేస్తుందా లేక.. మోర్గాన్‌ సేన స్పిన్‌ తంత్రం ఫలిస్తుందా అనేది చూడాలి. నేపథ్యంలో కేకేఆర్‌ తుది జట్టును ఓసారి పరిశీలిద్దాం.

అతికష్టం మీదే ఫైనల్స్

అతికష్టం మీదే ఫైనల్స్

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతికష్టం మీద ఫైనల్స్ చేరిందని చెప్పాలి. లీగ్ తొలి దశలో మోర్గాన్ సేన ప్రదర్శన చూస్తే.. పట్టికలో చివరి స్థానాల్లో నిలవడం ఖాయం అనిపించింది. తొలి దశలో ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం రెండే విజయాలు అందుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ మ్యాచులు యూఏఈకి మారడం ఆ జట్టుకు కలిసివచ్చింది. ఆడిన ఏడు మ్యాచుల్లో ఏకంగా ఐదింటిలో గెలుపొందింది.

దాంతో 14 పాయింట్లు సాధించి నాలుగో స్థానంను కైవసం చేసుకుంది. ముంబై ఇండియన్స్ కూడా 14 పాయింట్లతో ఉన్నా.. నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో మోర్గాన్ సేన ప్లే ఆఫ్స్‌ చేరింది. ఎలిమినేటర్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన క్వాలిఫయర్‌-2లో దాదాపు ఓటమి అంచన నిలిచిన కోల్‌కతాని రాహుల్ త్రిపాఠి సిక్స్ బాది ఫైనల్స్ చేర్చాడు.

వెంకీ చెలరేగితే

వెంకీ చెలరేగితే

దేశవాళీ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ను ఓపెనర్‌గా ఆడించి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మంచి ఫలితాలు రాబడుతోంది. యూఏఈలో ఆడిన మొదటి మ్యాచులోనే అతడు చెలరేగాడు. దాంతో వరుస అవకాశాలు దక్కించుకుని జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి వెంకీ అద్భుత ఆరంభాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

అంతేకాదు పార్ట్‌టైం బౌలర్‌గా, ఫీల్డర్‌గానూ జట్టుకు బాగా ఉపయోగపడుతున్నాడు. చాలా మ్యాచ్‌ల్లో గిల్‌, వెంకటేశ్‌లే కోల్‌కతా బ్యాటింగ్‌ భారాన్ని మోశారు. గిల్ కూడా అద్భుతంగా సుడుతున్నాడు. కీలక ఫైనల్లోలో కూడా ఈ ఇద్దరు సత్తాచాటితే కోల్‌కతాకు తిరుగుండదు. అయితే చెన్నై విభాగాన్ని ఈ జోడి ఎంత మేరకు ఎదుర్కుంటారో చూడాలి.

షకిబ్‌ డౌటే

షకిబ్‌ డౌటే

రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణాలు కూడా కోల్‌కతా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రిపాఠి, రాణాల దూకుడైన బ్యాటింగ్ ప్రత్యర్థికి పెద్ద సవాలే. ఈ ఇద్దరు మ్యాచును ఒంటిచేత్తో గెలిపించగలరు. ముఖ్యంగా త్రిపాఠి క్వాలిఫయర్‌-2లో గెలుపు ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ఫైనల్లో కూడా అతడి నుంచి మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది.

ఇక సీనియర్లు ఇయాన్ మోర్గాన్‌, దినేశ్‌ కార్తీక్‌ ఇప్పటివరకు తమ సత్తాచాటలేదు. వీళ్ల మెరుపులు కేవలం 1-2 మ్యాచులకే పరిమితం అయ్యాయి. ముఖ్యంగా మోర్గాన్ ఫామ్ కలవరపెడుతోంది. అయితే కెప్టెన్‌గా మాత్రం మెరుస్తున్నాడు. కీలక సమయాల్లో తనదైన వ్యూహాలతో జట్టుకు మంచి విజయాలు అందిస్తున్నాడు. కీలక మ్యాచ్ కాబట్టి మోర్గాన్‌ కూడా గాడిలో పడితే.. కోల్‌కతాకు తిరుగుండదు.

ఇక స్టార్ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్ ఈ మ్యాచ్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గాయం కారణంగా గత మ్యాచుల్లో ఆడన రసెల్.. ప్రస్తుతం ఫిట్‌నెస్‌ సాదించాడు. రసెల్ స్థానంలో ఆడిన షకిబ్‌ ఉల్ హాసన్ సత్తాచాటాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని కట్టడిచేశాడు. అయితే దుబాయ్ పిచ్ షార్జా మాదిరిగా స్పిన్నర్లు అనుకూలించదు. ఇక్కడ పేసర్లు ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువ. దాంతో పేస్ ఆల్‌రౌండర్‌ అయిన రసెల్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి కెప్టెన్ ఎవరికీ ఓటేస్తాడో.

IPL2021 Final, CSKvsKKR: చెన్నైని కలవరపెడుతోన్న కోల్‌కతా ట్రాక్ రికార్డు! దుబాయ్ పిచ్, ఐపీఎల్ రికార్డ్స్ ఇవే!

మాయ చేస్తున్న నరైన్‌, వరుణ్‌:

మాయ చేస్తున్న నరైన్‌, వరుణ్‌:

బౌలింగ్‌ కూడా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు పెద్ద బలం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ నిలకడగా రాణిస్తున్నారు. మిస్టరీ స్పిన్నర్లు అయిన ఈ ఇద్దరినీ ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్టుకు పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా నరైన్‌ మాయ చేస్తున్నాడు. ఎలిమినేటర్‌లో కోల్‌కతా గెలవడానికి కారణం నరైన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడూ బ్యాటుతోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇక పేస్‌ విభాగంలో లుకీ ఫెర్గూసన్‌, శివమ్ మావి కూడా రాణిస్తున్నారు. ఫెర్గూసన్‌ తన షార్ట్ పిచ్ బంతులతో వికెట్లు పడగొడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ రోజు కూడా బౌలర్లు సమిష్టిగా రాణిస్తే.. కోల్‌కతా విజయం పెద్ద కష్టమేమి కాదు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తుది జట్టు(అంచనా):

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తుది జట్టు(అంచనా):

శుభ్‌మన్‌ గిల్, వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్ మోర్గాన్‌ (కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌ (వికెట్ కీపర్), షకిబ్‌ ఉల్ హాసన్/ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, లుకీ ఫెర్గూసన్‌, శివమ్ మావి.

Story first published: Friday, October 15, 2021, 8:16 [IST]
Other articles published on Oct 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+