CSK ప్లే ఆఫ్స్ చేరుతుంది.. ఆ సత్తా ధోనీకి ఉంది: వీరేంద్ర సెహ్వాగ్

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరుతుందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఆ జట్టు వరుస విజయాలందుకొని టోర్నీలో ముందడగువేస్తుందని తెలిపాడు. వరుస పరాజయాలతో చతికిలపడినా తన సారథ్యంతో చెన్నైను ప్లే ఆఫ్స్ తీసుకెళ్లే సత్తా ధోనీకి ఉందని చెప్పాడు. వ్యక్తిగత ప్రదర్శన దెబ్బతినడంతో రవీంద్ర జడేజా చెన్నై సారథ్య బాధ్యతలను ధోనీకి అప్పజెప్పిన విషయం తెలిసిందే.

ధోనీకి ఆ సత్తా ఉంది..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మళ్లీ కెప్టెన్‌గా బరిలోకి దిగిన ధోనీ.. ఫస్ట్ మ్యాచ్‌లోనే అద్భుత విజయాన్నందుకున్నాడు. ధోనీ రాకతో చెన్నై రాత కూడా మారింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వేలు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో చెన్నై 13 పరుగులతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. ఇక కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ధోనీ విజయాన్నందుకోవడంతో సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రిక్‌బజ్ షోలో మాట్లాడిన సెహ్వాగ్.. ధోనీ సారథ్యంలో సీఎస్‌కే వరుస విజయాలు నమోదు చేసి ప్లే ఆఫ్స్ చేరుకుంటుందని అంచనా వేశాడు.

17 ఏళ్లుగా చూస్తున్నా..
'2005 నుంచి ధోనీతో కలిసి ఉన్నాను. అతని నేతృత్వంలో టీమిండియాలో ఎలాంటి మార్పులు జరిగాయో దగ్గరుండి చూశాను. ఐసీసీ నాకౌట్లలో గెలుపొందాం. ఓడిపోతానుమనుకున్న మ్యాచ్‌ల్లో అనూహ్య విజయాలు అందుకున్నాం. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే సీఎస్‌కే వరుస మ్యాచ్‌ల్లో తప్పకుండా గెలుస్తుందనిపిస్తోంది. తద్వారా ప్లే ఆఫ్స్ చేరుతుంది'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

ప్లే ఆఫ్స్ కష్టమే..
అయితే ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో సీఎస్‌కే మూడే గెలుపొందింది. తద్వారా ఆరు పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. టోర్నీలో మిగిలిన ఐదు మ్యాచ్‌లకు ఐదు గెలిచినా.. 16 పాయింట్లే వస్తాయి. అప్పుడు రన్‌రేట్ కీలకం అవుతుంది. మెరుగైన రన్ రేట్ ఉంటే సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరుతోంది. ప్రస్తుతం చెన్నై -0.407 రన్ రేట్ నెగటీవ్‌గా ఉంది.


భారీ విజయాలు దక్కినా..
తదుపరి ఐదు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు నమోదు చేస్తేనే చెన్నైకి ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లు సాధించగా.. లక్నో సూపర్‌జెయింట్స్ 14 పాయింట్లు, రాజస్తాన్ రాయల్స్ 12 పాయింట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 పాయింట్లతో టాప్-4లో ఉన్నాయి. చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు.. ఈ నాలుగు జట్ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications