For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పార్టీ ప్రచారంలో సెహ్వాగ్?: సిగ్గుండాలి.. ఇంత దిగజారుతారా!!

Virender Sehwag Exposes Political Party Trying To Drag Him In Rajasthan Election Campaign

న్యూ ఢిల్లీ: ఎన్నికల ప్రచారానికి ఇది పరాకాష్ఠ. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పడరాని పాట్లు పడుతుంటాయి పార్టీలు. ఎప్పుడూ కనిపించని మొహాలన్నీ ఆత్మీయ ముసుగుతో దర్శనమిస్తుంటాయి. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడంతో పాటు స్టార్‌లను క్యాంపెయిన్ కోసం రంగంలోకి దింపి రోడ్ షోలు చేయిస్తుంటారు. సినీ తారలను, క్రీడాకారులతోనూ ప్రచారం నిర్వహిస్తారు. ఐతే రాజస్థాన్‌లోనూ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను రంగంలోకి దింపింది ఓ పార్టీ.

సెహ్వాగ్ స్పందించడం ఆ పార్టీకి కలిసొచ్చి

సెహ్వాగ్ స్పందించడం ఆ పార్టీకి కలిసొచ్చి

నిజంగా వీరేంద్ర సెహ్వాగ్ రావడం కాదు. ఇది కేవలం ప్రచారంలో ఓ భాగం మాత్రమే. కాకపోతే ఆ పార్టీ గురించి స్వయంగా సెహ్వాగ్ స్పందించడం ఆ పార్టీకి మరో రకంగా సహాయం చేసినట్లే అయింది. ఎన్నికల గురించి ముద్ర వేయించిన పాంప్లెట్లలో 'సభకు సెహ్వాగ్ వచ్చి ప్రసంగిస్తారు. ప్రజలంతా భారీగా తరలిరావాలి' అని న్యూస్ పేపర్లో యాడ్ వేయించారు.

ఐపీఎల్ వేలానికి మహూర్తం ఖరారు, ఒక్క రోజు మాత్రమే

సెహ్వాగ్ షాక్‌కు గురై అసహనం

సెహ్వాగ్ షాక్‌కు గురై అసహనం

సదరు విషయం ఎలాగోలా చివరకు సెహ్వాగ్‌ను చేరింది. ఆ పేపర్ చదివిన సెహ్వాగ్ షాక్‌కు గురై అసహనం వ్యక్తం చేశారు. సంబంధం లేకుండానే తన గురించి పేపర్ ప్రకటన ఇచ్చారని సదరు రాజకీయ పార్టీలపై మండిపడ్డారు. రాష్ట్రీయ లోక్‌తంత్రిక్ పార్టీ నవంబరు 29న అసింద్‌లో ఎన్నికల సభ నిర్వహించింది. అందుకు ఒక రోజు ముందే అన్ని వార్తా పత్రికలలో ఓ ప్రకటన ఇచ్చేసింది.

అనుమతి లేకుండానే పేరును వాడుకుని

సభకు తమ పార్టీ తరపున వీరేంద్ర సెహ్వాగ్ హాజరవుతారని.. అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని అందులో ఉంది. ఆ తప్పుడు ప్రకటనపై సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీ ఎన్నికల కోసం ప్రజలను మోసం చేస్తారా.. నా అనుమతి లేకుండానే నా పేరును వాడుకుని ప్రచారం చేస్తారా ? సిగ్గుండాలి. ఇటువంటి అబద్ధాల కంటే ప్రమాదకరమైనదేమంటే ఇలాంటి వాళ్లు అధికారంలోకి రావడమే' అంటూ లేదా అని ట్విటర్‌ ద్వారా అసహనం వ్యక్తం చేశారు.

మరాఠా అరేబియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా

మరాఠా అరేబియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా

సెహ్వాగ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. టీ10 లీగ్ జరుగుతున్నందున టోర్నీ పూర్తయ్యే వరకు అక్కడే ఉంటారు. గత సీజన్‌లో ప్లేయర్‌గా ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తుతం మరాఠా అరేబియన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ ట్వీట్ ద్వారా తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని స్పష్టం చేశారు.

Story first published: Tuesday, December 4, 2018, 12:25 [IST]
Other articles published on Dec 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+