
ఇప్పటికే ఆటగాళ్లను విడుదల చేసేసి
ఇందుకోసం ఫ్రాంచైజీలు రూ.145.25 కోట్లు వెచ్చించనున్నాయి. వేలం ప్రక్రియ ప్రారంభానికి ముందే.. జట్లు తమతో అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను గత నెలలో ప్రకటించాయి. గడిచిన సీజన్లో పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదులుకోనున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ 11 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ 23 మంది ఆటగాళ్లను తమతోనే ఉంచుకోవడానికి ఇష్టపడింది. దీంతో ఆ జట్టు కేవలం ఇదర్ని మాత్రమే కొనుగోలు చేయగలదు.

ఎవరెవర్ని వదిలేశారంటే
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యువరాజ్ సింగ్‌ను వదిలేయగా.. ఢిల్లీ జట్టు గౌతమ్ గంభీర్‌ను వదిలేసింది. రాజస్థాన్ రాయల్స్ జయదేవ్ ఉనద్కత్‌ను వదుకుంది. గత సీజన్లో రూ.11.5 కోట్ల భారీ మొత్తానికి రాజస్థాన్ అతణ్ని కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ తమ వికెట్ కీపర్ సాహాను, విండీస్ టీ20 కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్‌ను వదులుకుంది. హైదరాబాద్ జట్టు ముగ్గురు భారత ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లను కొనుగోలు చేయగలదు.

ఎన్నికల నేపథ్యంలో విదేశాల్లో నిర్వహించాలని
జేపీ డుమిని, ప్యాట్ కమిన్స్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లను ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసింది. సాధారణ ఎన్నికలు నిర్వహించనుండటంతో.. వచ్చే సీజన్లో ఐపీఎల్ మ్యాచ్‌లను పాక్షికంగా లేదా పూర్తిగా విదేశాల్లో నిర్వహించే అవకాశాలున్నాయి. ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం టైమ్‌ను బీసీసీఐ మార్చింది. వేలానికి కూడా మంచి వ్యూవర్‌షిప్, ఆదాయం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఐపీఎల్ సీజన్ 12 వేలం సమయాన్ని మార్చినట్లు బోర్డు వెల్లడించింది.

వ్యూహాత్మకంగా వేలం తేదీలోనూ మార్పు
మామూలుగా వేలం ఎప్పుడు జరిగినా ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యేది. అయితే ఈసారి మాత్రం అది మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలవుతుంది. దీనివల్ల ప్రైమ్‌టైమ్ వ్యూవర్‌షిప్‌ను బీసీసీఐ లక్ష్యంగా చేసుకుంది. డిసెంబర్ 18న జరిగే ఈ వేలం మధ్యాహ్నం 3 గంటలకు మొదలై రాత్రి 9.30 గంటలకు ముగుస్తోంది. వేలం తేదీని కూడా బోర్డు వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. డిసెంబర్ 18 ఇండియా, ఆస్ట్రేలియా రెండో టెస్ట్ చివరి రోజు. అదే రోజు జరగనుండటంతో క్రికెట్ అభిమానులు అనుసరించేందుకు వీలుగా ఉంటుందని కాబోలు బీసీసీఐ ఉద్ధేశ్యం.


Click it and Unblock the Notifications

