Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ కాదు.. ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మనే: వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag explains why Rohit Sharma best IPL captain than MS Dhoni

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అత్యుత్తమ సారథి రోహిత్ శర్మనేనని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అప్‌కమింగ్ ఐపీఎల్ 2023 సీజన్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో సహచర ఆటగాడు హర్భజన్ సింగ్‌తో కలిసి సెహ్వాగ్ మాట్లాడాడు. ఐపీఎల్‌లో అత్యుత్త సారథి ఎవరు అనే అంశంపై చర్చించాడు. ధోనీ కంటే రోహిత్ శర్మనే ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్ అని సెహ్వాగ్ చెప్పగా.. హర్భజన్ సింగ్ మాత్రం తన ఓటు ధోనీకేనని స్పష్టం చేశాడు.

రోహితే నా బెస్ట్ కెప్టెన్..

రోహితే నా బెస్ట్ కెప్టెన్..

ముందుగా సెహ్వాగ్ మాట్లాడుతూ.. తన అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మనే అత్యుత్తమ ఐపీఎల్ కెప్టెన్ అన్నాడు. రోహిత్ శర్మ ఎక్కువ ట్రోఫీలు గెలవడమే ఇందుకు కారణమని స్పష్టం చేశాడు. 'గణంకాలే అన్నీ చెబుతాయి. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ధోనీ కెప్టెన్‌గా మారాడు. అయితే రోహిత్‌ శర్మ మాత్రం ముంబై ఇండియన్స్ జట్టుతోనే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ముంబై కెప్టెన్‌గా తన విజయ యాత్రను ప్రారంభించాడు. అందుకే అతను ఐపీఎల్ అత్యుత్తమ కెప్టెన్ అనేది నా అభిప్రాయం.' అని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.

నా ఓటు ధోనీకే..

నా ఓటు ధోనీకే..

అయితే సెహ్వాగ్‌ వ్యాఖ్యలతో హర్భజన్‌ సింగ్ విభేదించాడు. ఐపీఎల్‌లో ఉత్తమ సారథిగా తన ఓటు మహేంద్ర సింగ్ ధోనీకేనని తెలిపాడు. 'నా అభిప్రాయం ప్రకారం ఐపీఎల్ అత్యుత్తమ కెప్టెన్ ధోనీనే. ఎందుకంటే ఆరంభం నుంచి అతను ఒకే ఫ్రాంఛైజీకి ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. అతను జట్టును నడిపించిన తీరు కూడా అమోఘం. ఇతర కెప్టెన్లు కూడా బాగానే రాణిస్తున్నారు. టైటిళ్లు కూడా గెలుచుకుంటున్నారు. అయితే.. ఓవరాల్‌గా చూస్తే మాత్రం నా ఓటు కచ్చితంగా ధోనీకే'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

రెండు జట్లలో ఆడాను..

రెండు జట్లలో ఆడాను..

ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ ఐదు ట్రోఫీలు గెలవగా.. ధోనీ సారథ్యంలో చెన్నై నాలుగు ట్రోఫీలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తాను రెండు జట్లలో ఆడానని, 10 ఏళ్లు ముంబై ఇండియన్స్‌కు ఆడటంతో అటు వైపే మనసు లాగుతున్నప్పటికీ.. చెన్నైతో రెండేళ్ల బంధంలో జట్టు నుంచి ఎంతో నేర్చుకున్నానని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను స్టార్ స్పోర్ట్స్ శుక్రవారం సాయంత్ర విడుదల చేసింది.

మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023..

మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023..

మార్చి 31న ప్రారంభం కానున్న భారత క్యాష్ రిచ్ లీగ్.. మే 28న ముగియనుంది. పాత పద్దతిలో హోమ్ అవే ఫార్మాట్‌లో ఐపీఎల్ 2023 సీజన్‌ను నిర్వహించనున్నారు. మొత్తం 70 మ్యాచ్‌ల్లో 18 డబుల్ హెడర్స్‌ను షెడ్యూల్ చేశారు. ప్రతీ జట్టు సొంతమైదానంలో 7 మ్యాచ్‌లు.. అవే వేదికల్లో మరో 7 మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి మ్యాచ్‌ డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఇక 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-ఏలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ గ్రూప్-ఏలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ గ్రూప్-బిలో ఉన్నాయి.

Story first published: Saturday, February 18, 2023, 15:09 [IST]
Other articles published on Feb 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+