కోహ్లీ వ్యూహం బాగుంది.. ఆర్‌సీబీ ఓడి గెలిచింది: వీరేంద్ర సెహ్వాగ్
'ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు'అనే సినిమా డైలాగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి సరిగ్గా సరిపోతుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ తమ ఆఖరి మ్యాచ్‌లో ఓడినా మెరుగైన రన్‌రేట్‌తో టాప్-2 ప్లేస్‌లో నిలిచి విజయం సాధించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 256 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ లక్ష్యం కంటే రన్‌రేట్‌ను కాపాడుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుంది. మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు.
ఓడినా గెలిచింది..
అయితే ఈ నిర్ణయాన్ని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసించాడు. విరాట్ కోహ్లీ వ్యూహం బాగుందని కొనియాడాడు. హైదరాబాద్ చేతిలో ఆర్‌సీబీ ఓడినా.. ప్లేఆఫ్స్ రేసులో మాత్రం గెలిచిందని వ్యాఖ్యానించాడు.
'ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ దూకుడుగా ఆడుంటే తప్పకుండా 170 పరుగులకే ఆలౌటయ్యేది. అప్పుడు టాప్-2 ప్లేస్ గల్లంతయ్యేది. అలా కాకుండా తమకు అవసరమైన నెట్‌రన్‌రేట్ సాధించేందుకు ఆర్‌సీబీ ప్రయత్నించింది. ఈ వ్యూహం తప్పకుండా అద్భుతమైనదే. ఓడినా గెలవడం అంటే ఇదే.

ఆర్‌సీబీదే టైటిల్..
ఆరంభంలో వెంకటేశ్ అయ్యర్ దూకుడుగా ఆడి మిగతా బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా చేశాడు. బెంగళూరు లక్ష్యానికి గట్టి పునాది వేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఈ సీజన్‌లో అతను ఇలా స్లోగా ఆడటం ఇదే తొలిసారి అనుకుంటా.
డిఫెండింగ్ ఛాంపియన్ బరిలోకి దిగన ఆర్‌సీబీ మరోసారి విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. ఇక ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు జరిగే ముల్లాన్‌పుర్, అహ్మదాబాద్ పిచ్‌లు బెంగళూరు ప్లేయర్ల ఆటకు సరిగ్గా సూటవుతాయి. ఇప్పటివరకు ఈ లీగ్ మొత్తం వారు ఆడిన తీరే అందుకు నిదర్శనం.'అని సెహ్వాగ్ వెల్లడించాడు.
SRH ఘనవిజయం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), ఇషాన్ కిషన్(46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79), హెన్రీచ్ క్లాసెన్(24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
అనంతరం ఆర్‌సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ రజత్ పాటిదార్(39 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. వెకంటేశ్ అయ్యర్(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44), కృనాల్ పాండ్యా(31 బంతుల్లో 5 ఫోర్లతో 41 నాటౌట్) పర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/33) రెండు వికెట్లు తీయగా.. సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్‌లకు తలో వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications