Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virender Sehwag:మేం వారిలా ఏతులు మాట్లాడం.. అందుకే మెగా టోర్నీల్లో పాక్‌పై మాదే ఆధిపత్యం!

Virender Sehwag explains reason behind India’s dominating record against Pakistan in ICC events
T20 World Cup : IND VS PAK తొడలు కొట్టడం కాదు,దమ్ముంటే గెలిచి చూపించండి!! || Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రపంచకప్ వేదికల్లో పాకిస్థాన్‌పై భారత్ ఆధిపత్యం చెలాయించడానికి గల కారణాన్ని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. మెగా టోర్నీల్లో మ్యాచ్‌లకు ముందు పాకిస్థాన్ ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లలా తాము ఏతులు మాట్లాడమని, పెద్ద పెద్ద స్టేట్‌మెంట్స్ అసలే ఇవ్వమన్నాడు. ఇదే టీమిండియా విజయ రహస్యమని తెలిపాడు. మాటలకు బదులు మ్యాచ్‌‌కు అన్ని రకాల సన్నదమవుతామని చెప్పాడు. అంతేకాకుండా ఒత్తిడిని భారత జట్టు బాగా హ్యాండిల్ చేయగలదని సెహ్వాగ్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వచ్చే ఆదివారం(అక్టోబర్ 24)న భారత్-పాకిస్థాన్ తలపడనున్న విషయం తెలిసిందే.

ఏతులు ఎక్కువ..

ఏతులు ఎక్కువ..

ఈ మెగా మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పాక్ మాజీ ఆటగాళ్లు, మీడియా తమ ఆటగాళ్లను కొనియాడుతూ పెద్ద పెద్ద స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. ఓ పాకిస్థాన్ టీవీ యాంకర్ అయితే తమ జట్టు చరిత్ర సృష్టించబోతుందని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌పై ఏబీపీ న్యూస్‌తో మాట్లాడిన సెహ్వాగ్.. ఈ తరహా వ్యాఖ్యలతోనే ఇన్నాళ్లు పాకిస్థాన్ తమ చేతిలో ఓటమిపాలైందన్నాడు. '2011, 2003 ప్రపంచకప్ గురించి మాట్లాడినా.. ఈ రెండు టోర్నీల్లో మాపై అంతగా ఒత్తిడి లేదు. ఎందుకంటే ఈ టోర్నీల్లో మేం పాకిస్థాన్ కంటే మెరుగైన స్థానంలో నిలిచాం. ఈ తరహా ఆటిట్యూడ్‌తో ఆడితే ఎవరూ ఏతులు మాట్లాడరనేది నా అభిప్రాయం.

భారత్ ఎప్పుడూ..

భారత్ ఎప్పుడూ..

ఇక పాకిస్థాన్ నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద స్టేట్‌మెంట్స్ రావడం ఖాయమే. ఇప్పుడు ఈ పాకిస్థాన్ న్యూస్ యాంకర్‌లా.. 'తమ సత్తా ఏంటో చూపిస్తాం.. చరిత్ర సృష్టిస్తాం' అనే పెద్ద పెద్ద మాటలు గతంలో కూడా మాట్లాడారు. కానీ భారత నుంచి ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు రాలేదు. ఎందుకంటే భారత్ ఎప్పుడూ ప్రిపరేషన్స్‌పైనే దృష్టిపెట్టేది. ఎంత బాగా సన్నదమైతే.. మ్యాచ్ ఫలితాన్ని అంత బాగా అంచనా వేయవచ్చు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రపంచకప్ వేదికగా భారత్‌ను పాక్ ఒక్కసారి కూడా ఓడించలేదు. వన్డే ప్రపంచకప్‌ల్లో ఇరు జట్లు 7 సార్లు తలపడగా ఏడింటికి ఏడు భారతే గెలవడం గమనార్హం. ఇక టీ20 ప్రపంచకప్‌ల్లో 5 సార్లు తలపడగా భారత్ 4 సార్లు గెలవగా.. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఇదే లక్కీ చాన్స్..

ఇదే లక్కీ చాన్స్..

మెగా టోర్నీల్లో భారత్ ఓడించాలనే కల నెరవేరాలంటే పాకిస్థాన్‌కు ఈ టీ20 ఫార్మాటే సువర్ణవకాశమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. టీ20 క్రికెట్‌లో మ్యాచ్ ఫలితాన్ని ఒక్కడు శాసించవచ్చని, కొన్ని బంతుల వ్యవధిలోనే మూమెంటమ్‌ను మార్చవచ్చన్నాడు. 'టీ20 ఫార్మాట్‌, ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే పాకిస్థాన్‌కు ఇదే మంచి అవకాశం. ఎందుకంటే 50 ఓవర్ ఫార్మాట్‌లో ఎలాగూ వారు రాణించలేరు. పొట్టి ఫార్మాట్‌లో ఏ ఒక్క ప్లేయర్ రాణించినా ప్రత్యర్థిని ఓడించవచ్చు. కానీ ఇప్పటికీ పాకిస్థాన్ ఆ పని చేయలేదు. అక్టోబర్ 24న ఏం జరుగుతుందో చూద్దాం మరి'అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

మెగా సమరం..

మెగా సమరం..

ఇక అక్టోబ‌ర్ 23 నుంచి టోర్నీ సూప‌ర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డ‌తాయి. గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌ వేదికగా తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. పాకిస్థాన్‌‌తో మ్యాచ్ అనంతరం అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న ఆఫ్గనిస్తాన్‌‌తో భారత్ ఆడనుంది. ఆ తర్వాత క్వాలిఫయర్‌లో గెలిచిన జట్లతో మరో రెండు మ్యాచులు కోహ్లీసేన తలపడనుంది. ఈ రెండు మ్యాచులు నవంబర్ 5, 8 తేదీల్లో జరగనున్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్‌ జట్లను భారత్ ఓడిస్తే.. సునాయాసంగా తదుపరి రౌండ్ చేరుకుంటుంది.

Story first published: Tuesday, October 19, 2021, 20:36 [IST]
Other articles published on Oct 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+