
అశ్విన్.. నీకు ఫుల్ ఫ్రీడమ్..
క్రికెట్ నిబంధనల్లో మార్పు చేయడంతో అశ్విన్‌కు మరింత స్వేచ్ఛ దొరికినట్లయిందని సరదాగా ట్వీట్ చేశాడు. 'కంగ్రాట్స్ అశ్విన్.. ఈ వారం నీకు బాగా కలిసొచ్చింది. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించావు. బట్లర్‌తో కలిసి రనౌట్లను ప్లాన్ చేయడానికి మరింత స్వేచ్ఛ లభించింది.' అని సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. ఇక అభిమానులు ఈ ట్వీట్‌పై ఫన్నీగా స్పందిస్తున్నారు. అశ్విన్ ట్రెండ్ ఫాలోవర్ కాదని, ట్రెండ్ సెట్టర్ అంటూ సినిమా డైలాగ్స్ కామెంట్ చేస్తున్నారు.

జోస్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడంతో..
ఐపీఎల్ 2019 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్.. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన జోస్ బట్లర్‌ను ఓ లీగ్ మ్యాచ్‌లో మన్కడింగ్ చేశాడు. అశ్విన్ బౌలింగ్ చేస్తుండగా.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న జోస్ బట్లర్ క్రీజు దాటి ముందుకు రావడంతో అతడిని ఔట్ చేశాడు. ఈ ఘటనపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. అశ్విన్ చేసిన పని అనైతికం అంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అయితే, అశ్విన్ ఎప్పటికప్పుడూ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ వచ్చాడు. తను చేసిన దాంట్లో తప్పేం లేదని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించాడు.

సర్వత్రా విమర్శల నేపథ్యంలో..
అప్పటి నుంచి ఈ ఔట్‌పై తీవ్ర చర్చ జరుగుతూ వచ్చింది. నిబంధనల్లో ఉన్నదే అశ్విన్ చేశాడని భారత ఆటగాళ్లు మద్దతు తెలపగా.. క్రీడా స్పూర్తికి విరుద్దమని ఇతరులు వాదించారు. అంతేకాకుండా మన్కడింగ్ అనే పేరును మార్చాలని, ఇది భారత దిగ్గజ ప్లేయర్ వినూ మన్కడ్‌ను అవమానపరచడమేనని సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ నిబంధనపై రివ్యూ చేసిన ఎంసీసీ.. తాజాగా రనౌట్ జాబితాలోకి చేర్చింది.

అశ్విన్, బట్లర్ ఒకే టీమ్‌లో..
ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో అశ్విన్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.5 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ - 2022 సీజన్‌లో అశ్విన్, జోస్ బట్లర్ ఒకే జట్టు తరఫున ఆడనున్నారు. ఈ క్రమంలోనే జోస్ బట్లర్‌తో కలిసి నాన్ స్ట్రైకర్ రనౌట్లకు ప్రణాళికలు రచించని అశ్విన్‌కు సెహ్వాగ్ సూచించాడు. ఇక సచిన్, సెహ్వాగ్‌తో పాటు ఇతర క్రికెటర్లు కూడా ఈ మార్చి నిబంధనలను స్వాగతిస్తున్నారు.


Click it and Unblock the Notifications












