Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారు ఎప్పుడు ఇంటికి వెళ్దామా? అని చూస్తున్నారు: వీరేంద్ర సెహ్వాగ్

చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) బ్యాటర్ల‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీఎస్‌కే బ్యాటర్లలో ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఆడటం లేదని విమర్శించాడు. ఆ జట్టు స్టార్ బ్యాటర్ రవీంద్ర జడేజా స్ట్రైక్‌రేట్ మరి దారుణంగా ఉందని అసహనం వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. 9 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఏడింటిలో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సీఎస్‌కే బ్యాటింగ్ తీరుపై మాట్లాడిన సెహ్వాగ్.. ఘాటుగా విమర్శలు గుప్పించాడు.

Virender Sehwag Brutally Slammed Ravindra Jadeja s Strike-Rate And CSK s Strategy In IPL 2025

'సీఎస్‌కే జట్టులోని సగం మంది బ్యాటర్లు ఎప్పుడు ఇంటికి వెళ్దామా? అన్నట్లు ఉన్నారు. ఈ టోర్నీ ఎప్పుడు ముగుస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. జట్టులో ఒక్కరైనా బాధ్యత తీసుకోవాలి. డెవాల్డ్ బ్రెవిస్ ఆ బాధ్యత తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ షాట్ ఆడి ఔటయ్యాడు. జడేజా అప్‌ది ఆర్డర్ వస్తే.. అతను మెరుగైన స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయాలి.

ప్రస్తుతం అతని స్ట్రైక్‌రేట్ మరి దారుణంగా ఉంది. అతను 15-18వ ఓవర్‌ వరకు బ్యాటింగ్ చేయాలి. ఇతర బ్యాటర్లు వేగంగా ఆడే ప్రయత్నం చేయాలి. సామ్ కరణ్‌ను మూడో స్థానంలో ఎందుకు ఆడిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అతను అప్‌ది ఆర్డర్‌లోనే ఆడాలి. కానీ మూడో స్థానంలో కాకుండా నాలుగో స్థానంలో ఆడించాలి. ఐఎల్ టీ20లో అతను నాలుగో స్థానంలోనే ఆడి రాణించాడు. జడేజా తర్వాత దూబే, సామ్ కరణ్, దీపక్ హుడాలను బ్యాటింగ్‌కు పంపించాలి. నిలకడగా రాణించే రుతురాజ్ గైక్వాడ్ దూరమవ్వడం సీఎస్‌కేకు నష్టం చేసింది.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, April 27, 2025, 16:01 [IST]
Other articles published on Apr 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+