Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంగూలీ కాదు.. నన్ను ఓపెనర్‌గా మార్చింది అతనే: వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెడ్ బాల్ క్రికెట్‌లో దూకుడుగా ఆడిన తొలి బ్యాటర్ సెహ్వాగ్ అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. 99, 199, 299 పరుగుల వద్ద కూడా సిక్సర్ బాదిన ఏకైక డాషింగ్ బ్యాటర్ సెహ్వాగ్.

అతను ఆల్‌ఫార్మాట్ ప్లేయర్.. వన్డేల్లో ఆడించాలి: వీరేంద్ర సెహ్వాగ్

అతను ఆల్‌ఫార్మాట్ ప్లేయర్.. వన్డేల్లో ఆడించాలి: వీరేంద్ర సెహ్వాగ్

అయితే కెరీర్ ఆరంభంలో సెహ్వాగ్ లోయర్ మిడిలార్డర్‌లో ఆడేవాడు. ఆ తర్వాత ఓపెనర్‌గా ప్రమోషన్ అందుకొని ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. సెహ్వాగ్ కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడని అంతా అనుకుంటారు. కానీ తనను ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది గంగూలీ కాదని తాజాగా సెహ్వాగ్ వెల్లడించాడు.

Virender Sehwag Became an Opener After Zaheer Khan s Suggestion Not Sourav Ganguly s Idea

జహీర్ ఖాన్ సలహాతోనే..

పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్‌తో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీరేంద్ర సెహ్వాగ్ ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే తనను ఓపెనర్‌గా ఆడించాలని గంగూలీకి జహీర్ ఖాన్ చెప్పాడని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఓపెనర్‌గా తాను విఫలమైతే జట్టు నుంచి తొలగించవద్దని గంగూలీని తాను వేడుకున్నానని, దానికి అతను హామీ ఇచ్చాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

సచిన్ గాయంతో జట్టుకు దూరమవడంతో 2002లో ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లో సెహ్వాగ్ ఓపెనర్‌గా అరంగేట్రం చేశాడు. తొలి బంతి నుంచే బౌండరీలు బాది టెస్ట్ క్రికెట్‌‌కు దూకుడు పరిచయం చేసిన సెహ్వాగ్.. 104 టెస్ట్‌ల్లో 23 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలతో 8586 పరుగులు చేశాడు. ఇందులో రెండు ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి.

కోహ్లీ X కుంబ్లే గొడవ వల్లే కోచ్ పదవికి దరఖాస్తు చేశా: వీరేంద్ర సెహ్వాగ్

Also Read

కోహ్లీ X కుంబ్లే గొడవ వల్లే కోచ్ పదవికి దరఖాస్తు చేశా: వీరేంద్ర సెహ్వాగ్

251 వన్డేలు ఆడిన సెహ్వాగ్ 15 సెంచరీలతో 8273 పరుగులు సాధించాడు. ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో అతను 219 పరుగులతో డబుల్ సెంచరీ కూడా సాధించాడు. 2007 టీ20 ప్రపంచకప్ , 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్‌ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. సెహ్వాగ్‌ను ఓపెనర్‌గా ఆడించాలని జహీర్ ఖాన్ ఇచ్చిన సలహా.. భారత జట్టు రాతనే మార్చేసింది.

Story first published: Friday, August 21, 2026, 17:54 [IST]
Other articles published on Aug 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+