ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్‌పై వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. వారి అప్రోచ్ పద్దతి ప్రకారం లేదని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ పేలవ ప్రదర్శన వారి ఘోర పరాజయానికి కారణమైందని చెప్పాడు. భారత్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 4-1తో చిత్తయిన విషయం తెలిసిందే.
ర్మశాల వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఇంగ్లండ్.. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియా వేదికగా భారత జట్టును అభినందించిన సెహ్వాగ్.. ఇంగ్లండ్ ఆటతీరుపై విమర్శలు గుప్పించాడు. ఓ పద్దతి లేకుండా ఆడి మూల్యం చెల్లించుకున్నారని తెలిపాడు.

'బజ్‌బాల్ పవర్ ఆగిపోయింది. వారి పిచ్చికి కూడా ఓ పద్దతి ఉండాలి. అసలు ఇంగ్లండ్ దగ్గర సరైన గేమ్ ప్లాన్ లేదు. ముఖ్యంగా రెండో టెస్ట్ తర్వాత వారు క్లూలెస్‌గా కనిపించారు. కెప్టెన్ ఘోరంగా విఫలమవడం వారి కష్టాలను రెట్టింపు చేసింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లంతా ఓ భ్రమలో జీవిస్తున్నట్లు కనిపించారు.
ఈ బజ్‌బాల్ విధానం సక్సెస్ కావాలంటే ఓ ప్రణాళిక కావాలి. ఇంగ్లండ్ జట్టు దగ్గర అది కొరవడింది.'అని సెహ్వాగ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. 259 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. రవిచంద్రన్ అశ్విన్(5/77) ధాటికి 195 పరుగులకే కుప్పకూలింది. జో రూట్(128 బంతుల్లో 12 ఫోర్లతో 84) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
అశ్విన్‌కు అండగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/38), కుల్దీప్ యాదవ్(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులకు ఆలౌటైంది. రోహిత్(103), శుభ్‌మన్ గిల్(110) సెంచరీలతో రాణించగా.. దేవదత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56), యశస్వి జైస్వాల్(57) హాఫ్ సెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్(5/173) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.