ఆ ఆర్‌సీబీ బౌలర్‌ను టీమిండియాలోకి తీసుకోవాలి: సెహ్వాగ్
అద్భుతమైన ఆటతీరు కనబర్చినప్పుడు వయసుతో సంబంధం లేకుండా టీమిండియాలోకి తీసుకోవాలని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ విషయంలో బీసీసీఐ పునరాలోచన చేయాలని సూచించాడు.
ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. పర్పుల్ క్యాప్ కూడా అతని దగ్గరే ఉంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగే బ్యాటర్లను భువీ ఇబ్బంది పెడుతున్నాడు. స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తూ ఆర్‌సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
భువీని టీమిండియాలోకి తీసుకోవాలి..
భువనేశ్వర్ కుమార్ ప్రదర్శనను కొనియాడిన సెహ్వాగ్.. అతనికి మళ్లీ టీమిండియాలో అవకాశం కల్పించాలని సూచించాడు. జస్‌ప్రీత్ బుమ్రాకు భువనేశ్వర్ కుమార్ జతైతే ప్రత్యర్థులకు మరిన్ని కష్టాలు తప్పవని అభిప్రాయపడ్డాడు. 'వయసు అనేది సంఖ్య మాత్రమే. భువనేశ్వర్ కుమార్‌కు ఇప్పుడు 35-36 ఏళ్ల వయసు ఉండొచ్చు. ఐపీఎల్‌లో అతను అద్భుతమై ప్రదర్శన కనబరుస్తున్నాడు. అలాంటప్పుడు టీ20 ఫార్మాట్‌లో భారత జట్టుకు ఎంపిక చేసే విషయంపై పునరాలోచన చేయడంలో తప్పులేదు.

భువీ-బుమ్రా కాంబినేషన్..
సెలెక్టర్లూ దీనిపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. బుమ్రా, భువనేశ్వర్ కుమార్ కాంబినేషన్‌ను ఇప్పటికే చూశాం. మరోసారి అలా ప్రయత్నించొచ్చు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఇప్పటికీ ఆ పదును తగ్గలేదు. మునపటిలా భువీలానే సత్తా చాటుతున్నాడు. అందుకే అతను మళ్లీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టేందుకు ఆలోచనలు చేయాలి.'అని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
ఆర్‌సీబీ తరఫున ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ కుమార్ 7.54 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ దెబ్బకు ప్రత్యర్థి బ్యాటర్లు హడలెత్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications