Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ చేసిన ఆ పనికి 2-3 మ్యాచ్‌లు నిషేధం విధించాలి: వీరేంద్ర సెహ్వాగ్

ఐపీఎల్ నిర్వాహకులపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్ రూల్స్ విషయంలో కుర్రాడికి ఓ న్యాయం? స్టార్ క్రికెటర్లకు మరో న్యాయమా? అని ప్రశ్నించాడు. లక్నో సూపర్ జెయింట్స్ యువ స్పిన్నర్ దిగ్వేష్ రతిపై ఓ మ్యాచ్ నిషేధం విధించడాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో వికెట్ తీసినప్పుడల్లా దిగ్వేష్ రతి వివాదాస్పద రీతిలో సంబరాలు చేసుకున్నాడు. నోట్‌బుక్ సెలెబ్రేషన్స్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను కవ్వించాడు.

ఈ సంబరాలను తప్పుబట్టిన ఐపీఎల్ నిర్వాహకులు అతన్ని మందలించడంతో పాటు మ్యాచ్ ఫీజులో కోత విధించారు. అయినా అతను తన తీరును మార్చుకోలేదు. మధ్యలో పిచ్‌పై రాసుకుంటూ సెలెబ్రేషన్స్‌ మార్చినా..ఆ తర్వాత మళ్లీ పాత తరహాలోనే నోట్ బుక్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో గొడవపడ్డాడు. ఈ సెలెబ్రేషన్స్‌ను అభిషేక్ శర్మ తప్పుబట్టగా.. దిగ్వేష్ రతి అతనిపైకి దూసుకెళ్లాడు. దిగ్వేష్ రతి తీరును తప్పుబట్టిన మ్యాచ్ నిర్వాహకులు ఓ మ్యాచ్ నిషేధం విధిస్తూ కఠిన చర్యలు తీసుకున్నారు.

Virender Sehwag Argues Against Digvesh Rathi s Ban Highlighting Dhoni and Kohli s Similar Incidents

అయితే దిగ్వేష్ రతిపై నిషేధం విధించడాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు. గతంలో స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీలు అంపైర్లతో అనుచితంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయని, కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశాడు. తొలి సీజన్ ఆడుతున్న దిగ్వేష్ రతిపై ఓ మ్యాచ్ నిషేధం విధించడం సరికాదని అభిప్రాయపడ్డాడు.

'దిగ్వేష్ రతిపై విధించిన నిషేధం కాస్త కఠినమైంది. అతనికి ఇదే తొలి ఐపీఎల్ సీజన్. గతంలో మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలోకి దూసుకెళ్లాడు. అప్పుడు అతనిపై ఎలాంటి నిషేధం విధించలేదు. విరాట్ కోహ్లీ కూడా అంపైర్లతో చాలా సార్లు వాగ్వాదానికి దిగాడు. అతనిపై కూడా ఎలాంటి నిషేధం విధించలేదు. దిగ్వేష్ రతిని కూడా వదిలేయాల్సింది. ఎందుకంటే అతను ఓ యువ ప్లేయర్. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాడు. మ్యాచ్ ఫీజులో కోత విధించి వదిలేయాల్సింది.'అని క్రిక్ బజ్‌ షోలో సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ 2019లో నోబాల్ విషయంలో అంపైర్ల నిర్ణయాన్ని తప్పుబడుతూ ధోనీ మైదానంలోకి దూసుకెళ్లాడు. ఆ సమయంలో ధోనీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. ధోనీ చేసిన పనికి అతన్ని 2-3 మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించాల్సిందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో దిగ్వేష్ రతి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 13 మ్యాచ్‌ల్లో 8.25 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టాడు. మిడిల్ ఓవర్లలో లక్నోకు కీలకంగా మారాడు. కానీ లక్నో ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.

Story first published: Thursday, May 29, 2025, 18:59 [IST]
Other articles published on May 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+