వందేళ్ల తర్వాత కూడా భారత అత్యుత్తమ కెప్టెన్ ధోనీనే: విరాట్

రాంచీ: టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి శనివారం అనూహ్యంగా వైదొలిగారు. తన అభిమానుల కోసం పంచుకున్న సందేశంలో మీ నుంచి ఎల్లప్పుడూ లభించే ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అని సోషల్ మీడియాలో రాశారు. ఈ సాయంత్రం 7.29 తర్వాత నన్ను పదవీ విరమణ చేసినట్లు ఆలోచించండి అని తన పోస్టులో పేర్కొన్నారు. ధోని రిటైర్మెంట్‌పై ఎందరో స్పందించారు. కొందరు ఆయనతో కలిసి నడిచిన కాలాన్ని గుర్తుచేసుకోగా.. మరికొందరు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక జార్ఖండ్ యువ క్రికెటర్ విరాట్ సింగ్ స్పందిస్తూ భావోద్వేగం చెందాడు.

చివరిదని మాకు ముందే తెలుసు:
తాజాగా విరాట్ సింగ్ మైఖేల్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ... 'నిజం చెప్పాలంటే.. ఐసీసీ ప్రపంచకప్ 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ టీమిండియాకు ధోనీ ఆడిన చివరిదని మాకు తెలుసు. రాంచీలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మహీ మనస్సు రిటైర్మెంట్ కోరుకుంటుందని మాకు సూచనలు వచ్చాయి. జార్ఖండ్ ఆటగాళ్లుకు తెలుసు మహీ ఇప్పటికే తన చివరి మ్యాచ్ ఆడాడని. నిన్న చేసిన ప్రకటన అధికారికమే. ఏదేమైనా అలా రిటైర్మెంట్ వార్త మనందరికీ ఒక ఉద్వేగభరితమైన క్షణం' అని తెలిపాడు. విరాట్ జార్ఖండ్ రాష్ట్ర జట్టు మిడిలార్డర్‌లో కీలక సభ్యుడు.

వందేళ్ల తర్వాత కూడా:
'ఎంఎస్ ధోనీ సుమారు 15 సంవత్సరాలు టీమిండియాకు సేవ చేసాడు. భారత క్రికెట్ జట్టుకు ఆయన చేసిన సహకారం ఎంతో ఉంది. మహీ భారతదేశం కోసం చాలా ఆటలను గెలిచాడు. అయితే ధోనీ గురించి ఒకే ఒక్క విషయం నేను చెప్పగలను.. వంద సంవత్సరాల తరువాత కూడా ఉత్తమ భారత క్రికెట్ జట్టులో అతడు ఎన్నుకోబడతాడు. వందేళ్ల తర్వాత కూడా భారత అత్యుత్తమ కెప్టెన్ ధోనీనే. మహీ భాయ్ తన భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నా' అని విరాట్ సింగ్ పేర్కొన్నాడు.

రైనా మరో రెండేళ్లు ఆడాల్సింది:
సురేష్ రైనా రిటైర్మెంట్‌పై కూడా విరాట్ సింగ్ స్పందిస్తూ మరో రెండేళ్లు టీమిండియాకు ఆడే సత్తావుందని చెప్పుకొచ్చాడు. 'నేను రైనాను ప్రతిభావంతులైన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌గానే కాకుండా చక్కటి ఫీల్డర్‌గా కూడా చూశాను. నేను రైనాను ఎప్పుడూ కలవలేదు కానీ తోటి క్రికెటర్ల నుండి అతని నుండి నేను విన్నది ఏమిటంటే.. అతను మంచి వ్యక్తి అని. మొత్తంమీద రైనా క్రికెట్‌లో పూర్తి ప్యాకేజీగా ఉన్నాడు. రైనాకు కేవలం 33 ఏళ్లు మాత్రమే. రెండు ఐపీఎల్‌లలో బాగా రాణించిన తరువాత జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి అతనికి ఇంకా అవకాశం ఉందని నేను భావిస్తున్నా. ఇది కేవలం ఆరు నెలల వ్యవధిలో జరుగుతుంది. మరో రెండేళ్లు టీమిండియాకు ఆడిఉంటే బాగుండేది. కానీ రిటైర్మెంట్ అతని నిర్ణయం. ఎంఎస్ ధోనితో స్పష్టంగా చర్చించాడని నేను భావిస్తున్నా. మహిలో కలిసి ఎన్నో మ్యాచులు గెలిపించాడు' అని జార్ఖండ్ రాష్ట్ర జట్టు మిడిలార్డర్ ఆటగాడు విరాట్ సింగ్ చెప్పుకొచ్చాడు.

రెండవ ఇన్నింగ్స్ బాగుండాలి:
'ప్రతి క్రికెటర్ ఏదో ఒక రోజు తన ప్రయాణాన్ని ముగించాలి. కానీ మనకు తెలిసిన ఎవరైనా ఆ నిర్ణయాన్ని దగ్గరగా ప్రకటించినప్పుడు, మనం ఎమోషన్‌ను ఎక్కువగా అనుభవిస్తాం. ఆయన దేశం కోసం చేసిన పనులన్నీ ఎల్లప్పుడూ అందరి హృదయాల్లో పదిలంగా ఉంటాయి' అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. 'భారత క్రికెట్‌కు మీ సహకారం ఎంతో ఉంది. నీతో కలిసి 2011 ప్రపంచకప్ గెలవడం నా జీవితంలో ఉత్తమ క్షణాలు. మీరు మీ రెండవ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు' అని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు.
MS Dhoni Retires: కన్నీళ్లు ఆగట్లేదు.. ధోనీ రిటైర్మెంట్‌పై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications