MS Dhoni Retires: కన్నీళ్లు ఆగట్లేదు.. ధోనీ రిటైర్మెంట్‌పై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్!!

హైదరాబాద్: ఎంఎస్ ధోనీ.. ఈ పేరు వింటేనే ఎదో తెలియని వైబ్రేషన్ మొదలవుతుంది. ఛేజింగ్‌లో మహీ ఉన్నాడంటే.. భారత్ విజయం సాధిస్తుందని ఓ సగటు అభిమాని ధీమా. వికెట్ల వెనుక మహేంద్రుడు నిల్చున్నాడంటే.. ప్రత్యర్థి పనైపోయినట్లే అని భరోసా. సారథిగా వ్యూహం పన్నాడంటే.. మ్యాచ్ మనదే అన్న నమ్మకం. అంతలా ధోనీ ప్రభావం చూపాడు.
దశాబ్దంన్నర పాటు అశేష అభిమానుల మనసులు గెలిచిన ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికాడు. చడీచప్పుడు లేకుండా టెస్టు క్రికెట్‌కు దూరమైన మహీ.. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి కూడా ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండానే తప్పుకున్నాడు. మహీ చేసిన ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు, పేరు మారుమోగుతోంది.
స్పందించిన టాలీవుడ్
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై చిన్న-పెద్ద, సాధారణ-సెలబ్రిటీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటుంన్నారు. రిటైర్మెంట్ విషయం తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రముఖులు, సెలబ్రిటీలు అంతర్జాతీయ క్రికెట్‌కి మహీ చేసిన సేవలపై అభినందనలు తెలుపుతూ ట్వీట్స్ పెడుతున్నారు. టాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు ధోనీ రిటైర్మెంట్‌పై పోస్ట్ చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి, హీరో మంచు విష్ణు చేసిన ట్వీట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
కన్నీళ్లు ఆగట్లేదు
ఎంఎస్ ధోనీ 2011 వన్డే ప్రపంచకప్‌లో సిక్సర్ బాది భారత్‌కు కప్ అందించిన విషయం తెలిసిందే. ఆ సిక్సర్‌కు సంబందించిన ఫొటోను మహేష్ బాబు ట్వీట్ చేస్తూ... 'ఆ ఐకానిక్ సిక్సర్‌ను ఎలా మరచిపోగలను. భారత్ 2011 ప్రపంచకప్ ఛాంపియన్స్ . వాంఖడే స్టేడియంలో ఉన్నట్టు ఉంది. ఆ సన్నివేశాలు తలచుకుంటే.. ఇప్పటికీ గర్వంగా ఉంది. కన్నీళ్లు ఆగట్లేదు. క్రికెట్ ఎప్పటికీ ఒకేలా ఉండదు' అని పేర్కొన్నాడు. మహేష్ బాబు చేసిన ట్వీట్ క్రీడాభిమానులను ఆకట్టుకుంటుంది. మహేష్ బాబుకు ఇష్టమైన క్రికెటర్లలో ఎంఎస్ ధోనీ ముందువరసలో ఉంటాడన్న విషయం తెలిసిందే.

నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్
'గొప్ప కెప్టెన్‌లలో ఒకడు. భారత జట్టుతో గొప్పసమయం గడిపినందుకు ధన్యవాదాలు. అద్భుతమైన వ్యక్తి. మీ ప్రదర్శన నెవర్ బిఫోర్.. బహూశా ఎవర్ ఆఫ్టర్' అని టాలీవుడ్ హీరో మంచు విష్ణు ట్వీట్ చేశాడు. 'మీరు మమ్మల్ని ఎంతగానో ఎంటర్‌టైన్ చేసి దేశానికే గర్వకారణంగా నిలిచారు. నరాలు తెగే ఉత్కంఠ పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండేలా చేశారు. మీరు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. మీరు అంతర్జాతీయ క్రికెట్‌కి బై బై చెప్పిన ఈ క్షణాలకు స్వీకరించడం చాలా కష్టంగా ఉంది' అని ఎస్ ఎస్ రాజమౌళి ట్వీటాడు. వీరు చేసిన ఈ ట్వీట్స్ చూసి పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ఐపీఎల్‌పై పూర్తిస్థాయి దృష్టి
ఎంఎస్ ధోనీని దగ్గరి నుంచి పరిశీలించిన వారెవరైనా.. అతడు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహించే ఉంటారు. గతేడాది ప్రపంచకప్ తర్వాత అతడు ఇక దేశం తరఫున ఆడబోడని చాలా మంది మాజీలు జోస్యం చెప్పారు. అయితే మహీ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలకడంతో ఐపీఎల్‌పై ఇక పూర్తిస్థాయి దృష్టి పెట్టే అవకాశం ఉంది. మహీ 2022 వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ఆడుతాడని ఇటీవల ఫ్రాంచైజీ అధికారి ఒకరు తెలిపిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications