న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: విరాట్ కోహ్లీ చెత్త రికార్డు!

 Virat Kohli Worst Record: Marks Most Duck Outs As Indian Captain

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన పేరిట చెత్త రికార్డు లిఖించుకున్నాడు. క్రికెట్‌లోనే రికార్డుల రారాజుగా పేరొందిన విరాట్.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో అత్యిధిక సార్లు డకౌట్ అయిన తొలి భారత్ టెస్ట్ కెప్టెన్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఓవరాల్‌గా రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో స్టీఫెన్ ఫ్లేమింగ్ టాప్‌లో ఉండగా.. విరాట్ కమ్లీ, గ్రేమ్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నారు. స్టీఫెన్ ఫ్లేమింగ్ తన కెరీర్‌లో కెప్టెన్‌గా 13 సార్లు డకౌటయ్యాడు. గ్రేమ్ స్మిత్, విరాట్ కోహ్లీ చెరొక పదిసార్లు సున్నా స్కోర్లకే వెనుదిరిగాడు.

కపిల్ తర్వాత..

కపిల్ తర్వాత..

రానున్న రోజుల్లో కోహ్లీ ఈ జాబితాలో టాప్‌లో నిలవనున్నాడు. అథర్ట్‌న్, క్రోంజ్, ధోనీ 8 సార్లు డకౌటయ్యారు. అంతేకాకుండా ఒకే ఏడాది 5 కంటే ఎక్కువ సార్లు డకౌటైన భారత టెస్ట్ కెప్టెన్‌గా కూడా కోహ్లీ తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. కోహ్లీ కన్నా ముందు కపిల్ దేవ్ 1983లో ఐదు కంటే ఎక్కువ సార్లు డకౌటవ్వగా.. విరాట్ కోహ్లీ 2017, 2021లో కెప్టెన్ ఐదు కంటే సార్లు డకౌటయ్యాడు. విరాట్ కోహ్లీ వివాదాస్పద రీతిలో ఔటవ్వగా.. అంపైర్ నిర్ణయంపై దుమారం రేగుతోంది. భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఆజాజ్ పటేల్ వేసిన 30వ ఓవర్‌లో ఈ తప్పిదం చోటు చేసుకుంది.

ఆధారల్లేవంటూ..

ఆధారల్లేవంటూ..

ఆజాజ్ వేసిన చివరి బంతిని కోహ్లీ డిఫెండ్ చేసే ప్రయత్నం చేయగా బంతి బ్యాట్, ప్యాడ్‌ను తాకింది. దాంతో కివీస్ ఆటగాళ్ల గట్టిగా అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నితీన్ మీనన్ ఔటిచ్చాడు. ఇక బ్యాట్ తాకిందనే ఆత్మవిశ్వాసంతో కోహ్లీ సమీక్ష కోరాడు. థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ పలు కోణాల్లో పరిశీలించాడు. అయితే బ్యాట్‌‌ను తాకిన బంతి ఆ తర్వాత టర్న్ అయి ప్యాడ్‌ను తాకినట్లు కనిపించింది. మరో కోణంలో బ్యాట్, ప్యాడ్‌ను ఒకేసారి కనిపించింది. అల్ట్రా ఎడ్జ్‌లో సైతం స్పైక్స్ కనబడ్డాయి. దాంతో పలు కోణాల్లో పరిశీలించిన వీరేందర్ శర్మ.. బ్యాట్‌ను ముందుగా తాకిందనడానికి ఆధారల్లేవని పేర్కొంటూ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించాడు. దాంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు.

భారత్ 160/4

భారత్ 160/4

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(44), మయాంక్ అగర్వాల్(52 బ్యాటింగ్) మంచి శుభారంభాన్ని అందించారు. ఆచితూచి ఆడుతూ.. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన శుభ్‌మన్ గిల్‌ను ఆజాజ్ పటేల్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా(0), విరాట్ కోహ్లీ(0) ఆజాజ్ పటేల్ తన వరుస ఓవర్లలో డకౌట్ పెవిలియన్ చేర్చాడు. పుజారాను బౌల్డ్ చేసిన పటేల్.. కోహ్లీని వికెట్ల ముందు బోల్తాకొట్టించాడు.

దాంతో పటిష్టంగా కనిపించిన భారత్ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మయాంక్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. దాంతో టీమిండియా 111/3 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్‌(18)ను కూడా ఆజాజ్ పటేల్.. కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 160 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది.

Story first published: Friday, December 3, 2021, 16:11 [IST]
Other articles published on Dec 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X