టీ20 ప్రపంచకప్ విజయంపైనే కోహ్లీ కెప్టెన్సీ భవితవ్యం... ఓడితే రోహిత్‌కే పగ్గాలు!

హైదరాబాద్: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ భవితవ్యం టీ20 ప్రపంచకప్ విజయంపై ఆధారపడి ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మెగాటోర్నీలో భారత్ ఓడితే కోహ్లీ కెప్టెన్సీపై వేటు పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై జూలైలో జరిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు దైనిక్ జాగ్రన్ ఓకథనాన్ని ప్రచురించింది. టీ20 ప్రపంచకప్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీసీఐ.. ఆ క్రమంలోనే టీమ్ సెలెక్షన్‌ను కూడా పకడ్బందీగా ఉండేలా చూసుకుంది. అంతేకాకుండా అపార అనుభవం కలిగిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఒప్పించి మరీ మెంటార్‌గా నియమించింది.

వేర్వేరు కెప్టెన్లు..
ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్‌లో ఓడితే.. ఇద్దరు కెప్టెన్సీల విధానాన్ని తీసుకురావాలని చూస్తుంది. టెస్ట్‌ల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని కొనసాగించి.. పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలు రోహిత్ శర్మకు ఇవ్వాలని సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై బోర్డు సమావేశాల్లో సమాలోచనలుజరిగాయని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. 'జూలైలో జరిగిన బీసీసీఐ ఏజీఎంలో టెస్ట్, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు వేర్వేరు కెప్టెన్లు నియమించాలనే విషయంపై సుదీర్ఘంగా చర్చించాం. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత దీనిపై ఓ క్లారిటీ రానుంది'అని సదరు అధికారి పేర్కొన్నాడు.

రోహిత్‌కు ఇవ్వాలని..
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సారథిగా నియమించాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఐపీఎల్‌లో సారథిగా ఐదు టైటిళ్లు గెలిపించడం.. మరోవైపు కోహ్లీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ గెలవకపోవడంతో ఈ డిమాండ్ ఎక్కువైంది. పైగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన కోహ్లీ కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో గెలిపించకపోవడంతో కూడా ఈ వాదన తెరపైకి వచ్చింది. కోహ్లీసారథ్యం టీమిండియా ఓడినప్పుడల్లా ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది.

మూడు టోర్నీల్లో విఫలం..
ద్వైపాక్షిక సిరీస్‌ల్లో జట్టును అద్భుతంగా నడిపిస్తున్నా.. కీలక ఐసీసీ ఈవెంట్లలో మాత్రం విఫలమవుతున్నాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్, ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ వరుసగా మూడు టోర్నీల్లో కోహ్లీకి చుక్కెదురైంది. ఈ మూడు టోర్నీల్లో కోహ్లీ కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మన్‌గా విఫలమయ్యాడు. అదే భారత విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే కోహ్లీ కెప్టెన్సీకి ఈ టీ20 ప్రపంచకప్ చివరి అవకాశంగా పరిగణిస్తున్నారు.

కోహ్లీనే తప్పుకుంటాడు..
టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించకపోతే విరాట్ కోహ్లీనే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటాడని విశ్లేషకులు అంటున్నారు. గత కొంత కాలంగా కోహ్లీ కూడా వ్యక్తిగతంగా రాణించడం లేదు. ఈ క్రమంలో తన బ్యాటింగ్‌పై దృష్టిసారించేందుకు.. ఎక్కువ కాలం ఆడేందుకు తానే సారథ్య బాధ్యతలు వదిలేస్తాడంటున్నారు.
ఏదీ ఏమైనా టీ20 ప్రపంచకప్ ఫలితంపైనే భారత క్రికెట్ భవిష్యత్తు ఆధారపడి ఉందనేది వాస్తవం. ఇక టోర్నీ కోసం భారత సెలక్షన్ కమిటీ బుధవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. సుదీర్ఘంగా ఆలోచించి పకడ్బందీ టీమ్‌ను ఎంపిక చేసింది. ఆశ్చర్యకరంగా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు కల్పించింది. ఇక మెగా టోర్నీ అక్టోబరు 17 నుంచి యూఏఈ, ఒమన్‌లో జరుగుతుంది. అక్టోబరు 24న పాకిస్థాన్‌తో పోరుతో టీమ్ ఇండియా టైటిల్ వేట ఆరంభమవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications