For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli ఒప్పుకోకున్నా.. వన్డే కెప్టెన్సీ పీకేసిన బీసీసీఐ! కనీస గౌరవం ఇవ్వకుండా..

 Virat Kohli Was Forced By BCCI To Step Down As One Day Captain

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) దారుణంగా అవమానించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తూ విరాట్ కోహ్లీకి షాకిచ్చిన బీసీసీఐ.. రోహిత్ శర్మకు మాత్రం డబుల్ ప్రమోషన్ ఇచ్చింది. ఇప్పటికే టీ20 టీమ్ పగ్గాలందుకున్న రోహిత్ శర్మకే వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అలాగే టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానే ప్లేస్‌లో హిట్ మ్యాన్‌ను నియమించింది.

ఈ మేరకు భారత క్రికెట్ బోర్డు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇందులో రోహిత్ శర్మ తదుపరి వన్డే కెప్టెన్ అని చెప్పిన బీసీసీఐ.. విరాట్ కోహ్లీ సేవలకు కనీస కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. దాంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 48 గంటలు టైమిచ్చి...

48 గంటలు టైమిచ్చి...

వాస్తవానికి టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలోనే జట్టు ఇంటిదారి పట్టిన తర్వాత కోహ్లీని కెప్టెన్‌గా తప్పిస్తారన్న వార్తలు వచ్చినా.. అందుకు బీసీసీఐ కొంత టైమ్ తీసుకుంది. సౌతాఫ్రికా పర్యటనకు జట్టు ఎంపిక నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ నుంచి వాలంటరీగా తప్పుకోవాలని బీసీసీఐ కోహ్లీకి 48 గంటలు టైమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ, కెప్టెన్సీని వదులుకునేందుకు విరాట్ ఒప్పుకోలేదట. అయినా బోర్డు వెనక్కు తగ్గలేదు. తమ ప్రకటనలో కోహ్లీని తప్పిస్తున్నట్లు పేర్కొనకుండానే వన్డే, టీ20 కెప్టెన్‌గా రోహిత్ ఉంటాడని ఆలిండియా సెలెక్షన్ కమిటీతో సింపుల్ స్టేట్‌మెంట్ ఇప్పించింది. అయితే బీసీసీఐ నిర్ణయం కోహ్లీ ఏ మాత్రం నచ్చలేదని అతని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

కోహ్లీకి ఘోర అవమానం..

కోహ్లీకి ఘోర అవమానం..

'బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని కోహ్లీ ఏ మాత్రం ఊహించలేదు. 2023 వన్డే ప్రపంచకప్‌ వరకు భారత జట్టు కెప్టెన్‌గా కొనసాగాలనుకున్నాడు. జట్టు కోసం అతను ఎన్నో చేశాడు. అలాంటి వ్యక్తిని ఇలా అవమానపరచడం భావ్యం కాదు'అని కోహ్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్ పేర్కొంది. వన్డే ప్రపంచకప్ కోసం కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అంతేకాకుండా ఆర్‌సీబీ కెప్టెన్సీని వదిలేసాడు. వర్క్ లోడ్ తగ్గించుకొని ఐసీసీ ట్రోఫీ అందించడంపై మరింత ఫోకస్ పెట్టాలనుకున్నాడు. టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెప్పేముందు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషాతో కూడా చర్చించాడు. కానీ టీ20 కెప్టెన్సీ వదులుకోవడమే అతనికి చేటు చేసింది.

ధోనీ కన్నా కోహ్లీ కెప్టెన్సీ రికార్డ్సే..

ధోనీ కన్నా కోహ్లీ కెప్టెన్సీ రికార్డ్సే..

బీసీసీఐ నిర్ణయం పట్ల కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సాధించిన ఘనతలు మరే భారత కెప్టెన్ కూడా అందుకోలేదని గుర్తు చేస్తున్నారు. గొప్ప కెప్టెన్‌గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ కన్నా కోహ్లీ కెప్టెన్సీ రికార్డ్సే మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు. 2013-2021 వరకు భారత వన్డే కెప్టెన్‌గా కొనసాగిన ధోనీ.. 95 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఇందులో భారత్ 65 విజయాలు సాధించగా.. 27 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.

ఒక మ్యాచ్ టై అవ్వగా.. రెండు ఫలితం తేలకుండా ముగిసాయి. విజయాల శాతం 70.43 పర్సంటేజ్‌గా ఉంది. ఇప్పటికే భారత క్రికెట్‌లో ఇదే ఆల్‌టైమ్ రికార్డు. ధోనీ 200 మ్యాచ్‌లకు సారథ్యం వహించగా.. భారత్ 110 గెలిచి 74 మ్యాచ్‌ల్లో ఓడింది. 5 మ్యాచ్‌లు టై అవ్వగా 11 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిసాయి. విన్నింగ్ పర్సంటేజ్ 59.52 మాత్రమే.

మన సెట్ అవ్వదనే..

మన సెట్ అవ్వదనే..

మూడు ఫార్మాట్లు ముగ్గురు కెప్టెన్ల విధానం భారత క్రికెట్ సెట్ అవ్వదనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్తగా వచ్చిన హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించాడని. అతని సూచనలతోనే ఇంత త్వరగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వాస్తవానాకి ఈ ఏడాది భారత్‌కు పెద్దగా వన్డే సిరీస్‌లు లేవు. కాబట్టి కొంత టైమ్ తీసుకుందామని బీసీసీఐ భావించిందని, కానీ ద్రవిడ్ ఒప్పుకోకపోవడంతో విరాట్‌ను తప్పించాల్సి వచ్చిందని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు.

'మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉంటే జట్టులో గందరగోళం నెలకొంటుంది. పరిమిత ఓవర్లలో ఒకే కెప్టెన్ ఉండటమే ఉత్తమమని భావించాం. టీ20 కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మనే దీనికి సరైన వాడనుకున్నాం. త్వరలోనే సెలెక్టర్లు దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. భారత క్రికెట్‌కు ఏది మంచి అయితే అదే చేస్తాం.'అని ఓ బీసీసీఐ అధికారి గత వారం వెల్లడించాడు. అతను చెప్పినట్లుగానే కోహ్లీ కెప్టెన్సీపై బీసీసీఐ వేటు వేసింది.

Story first published: Thursday, December 9, 2021, 11:23 [IST]
Other articles published on Dec 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+