కోహ్లీ అభ్యర్థనపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేం: సీఓఏ


న్యూ ఢిల్లీ: భారత జట్టు విదేశీ సిరీస్‌ల కోసం వెళ్లినపుడు పర్యటన పూర్తిగా ఆటగాళ్లతో వారి భార్యలు ఉండేలా అనుమతించాలంటూ టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన అభ్యర్థనపై తక్షణమే ఓ నిర్ణయానికి రాలేమని క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) చెప్పింది. ప్రస్తుతం విదేశీ పర్యటనల్లో రెండు వారాలు మాత్రమే ఆటగాళ్ల వెంట భార్యలు ఉండేలా అనుమతిస్తున్నారు.

తక్షణమే నిర్ణయం తీసుకోలేం
‘దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోలేం. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కొత్తగా ఏర్పడే బీసీసీఐ కార్యవర్గానికే వదిలేశాం'అని సీఓఏ ప్రతినిధి తెలిపారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్ మొత్తం ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐని కోరాడు. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తున్నారు.
పూర్తి వెజిటేరియన్‌గా మారిపోతోన్న కోహ్లీ

బీసీసీఐ విధాన నిర్ణయాన్ని:
'కోహ్లీతో కలిసి అనుష్క విదేశీ పర్యటనలకు వెళ్తోంది. చాలా దేశాలు తమ ఆటగాళ్ల వెంట భార్యలు, స్నేహితురాళ్లను తీసుకెళ్లడంపై నిబంధనలు విధించాయి. విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలనే అభ్యర్థన కొన్ని వారాల క్రితమే వచ్చింది. అయితే ఇది బీసీసీఐ విధాన నిర్ణయం కావున ఇందుకు సంబంధించి అభ్యర్థనను మేనేజర్ పంపాల్సి ఉంటుంది.' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

కేవలం పర్యటనలో రెండు వారాలు మాత్రమే
అసలు నిబంధన ప్రకారం విదేశీ పర్యటనలకు టీమిండియా క్రికెటర్లు.. సహాయక సిబ్బంది.. తమ భార్యలను కానీ, గర్ల్ ఫ్రెండ్స్‌తో కేవలం పర్యటన ఆరంభంలో రెండు వారాలు గడిపేందుకు మాత్రమే వీలు కల్పించింది బీసీసీఐ.

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా
అయితే పాత నిబంధనలను మార్చి టూర్ మొత్తం ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలని కోహ్లీ కోరుతున్నాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాబోయే శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్లు వన్డే, టీ20 సిరీస్‌లో పోటీ పడనున్నాయి. పిచ్ వాతావరణాన్ని బట్టి నీరు తాగేందుకు ఆటగాళ్లకు విరామం ఇవ్వాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐని కోరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications