పూర్తి వెజిటేరియన్‌గా మారిపోతోన్న కోహ్లీ


న్యూఢిల్లీ: హైదరాబాదీ బిర్యానీలు.. సిరాజ్ ఇంటికి వెళ్లి పార్టీలు చేసుకోవడాలు మొత్తం మారిపోనున్నాయి. ఒకప్పుడు మాంసాహార ప్రియుడిగా పేరున్న విరాట్ కొహ్లీ ఇప్పుడు తన ఫిట్ నెస్ కోసం మరో త్యాగానికి సిద్ధమైయ్యాడు. దాదాపు పూర్తి శాకాహారిగా మారిపోయేందుకు పూనుకున్నాడట. నాలుగు నెలలుగా విరాట్ జంతు, పక్షి సంబంధిత ఆహారానికి దూరంగా ఉన్నాడని.. వీగన్ గా సెటిలయ్యాడని తెలుస్తోంది.

రెండు మూడేళ్లుగా విరాట్ కొహ్లీ ఫిట్‌నెస్‌లో
ఈ మేరకు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా'ఒక కథనాన్ని ప్రచురించింది. రెండు మూడేళ్లుగా విరాట్ కొహ్లీ ఫిట్‌నెస్‌లో అనూహ్యమైన మార్పులను క్రికెట్ అభిమానులంతా గమనిస్తూనే ఉన్నారు. ఆ ఫిట్‌నెస్‌లో వచ్చిన మార్పే.. కొహ్లీ ఆట తీరును అద్భుతంగా మార్చిన వైనాన్ని కూడా క్రీడా పరిశీలకులంతా మెచ్చుకుంటున్నారు. కొహ్లీ అద్భుతమైన ఫిట్‌నెస్‌ను సంతరించుకున్నప్పటి నుంచి అద్వితీయమైన ఫామ్‌ను కూడా కొనసాగిస్తూ ఉన్నాడు.

పాలు, పెరుగు, గుడ్డుకు కూడా పూర్తి దూరంగా
ఈ నేపథ్యంలో కొహ్లీ శారీరక ఫిట్‌నెస్ కోసం డైట్‌లో కీలకమైన మార్పును కూడా చేసుకుంటున్నాడని తెలుస్తోంది. నాలుగు నెలల నుంచి కొహ్లీ పూర్తి శాకాహారాన్నే తీసుకుంటున్నాడని, మాంసానికి పూర్తి దూరం అయ్యాడని తెలుస్తోంది. ఆఖరికి పాలు, పెరుగు, గుడ్డుకు కూడా పూర్తి దూరంగా ఉంటున్నాడట టీమిండియా కెప్టెన్. తను తీసుకునే ఆహారంలో ఎక్కడా వీటి ఊసే ఉండటం లేదని సమాచారం.

అనుష్క చాలాకాలం నుంచే వీగన్‌గా
ఈ అలవాటు తనకు మరింత ఉపకరిస్తోందని, ఆట మరింత మెరుగుపడుతోందని కొహ్లీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. విశేషమేమంటే.. కొహ్లీ భార్య అనుష్క చాలాకాలం నుంచే వీగన్‌గా ఉంటోంది. ఆ ప్రభావమే కొహ్లీ మీద కూడా పడి ఉండొచ్చు. క్రీడాకారుల్లో టెన్నిస్ తారలు సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్, ఫార్ములా వన్ ఛాంపియన్ హమిల్టన్, మాజీ స్ప్రింటర్ కార్ల్ లెవిస్ లు వీగన్‌లుగా పేరు పొందారు.

క్లబ్‌లోకి కొహ్లీతో పాటుగా
ఇప్పుడు వారి క్లబ్‌లోకి కొహ్లీ జాయిన్ అయినట్టే. అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ మెస్సీ కూడా ప్రపంచకప్ సమయాల్లో వీగన్‌గా ఉండేవాడు. ఇక కోహ్లీ అంటే విపరీతమైన అభిమానం చూపించే వీరాభిమానులు కూడా వీగన్‌లుగా మారిపోతారేమో..!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications