Virat vs Rohit నెట్టింట మళ్లీ రచ్చ! గంగూలీకి అండగా రోహిత్ అభిమానులు.. తిప్పికొడుతున్న కోహ్లీ ఫ్యాన్స్!

హైదరాబాద్: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్తూ వెళ్తూ.. రాజేసిన అగ్గి ఇప్పట్లో చల్లారేలా కనిపించటం లేదు. నిన్న వరకు కోహ్లీXరోహిత్‌గా ఉన్న పరిస్థితి కోహ్లీ X గంగూలీగా మారింది. ఈ అంతర్యుద్దం మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. వన్డే కెప్టెన్సీ వేటుపై కోహ్లీ చేసిన కామెంట్స్‌పై స్పందించేందుకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ సౌరవ్ గంగూలీ పూర్తిగా నిరాకరించాడు. వ్యవహారాన్ని బోర్డు సరైన రీతిలో పరిష్కరించుకుంటుందని చెప్పాడు. సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కేముందు బుధవారం మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. బోర్డుపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని తనను ఎవరు అడగలేదని, వన్డే కెప్టెన్సీ వేటు గురించి టెస్ట్ టీమ్ సెలెక్షన్ అప్పుడే చెప్పారని ప్రకటించాడు.
గంగూలీపై ఘాటు వ్యాఖ్యలు..
టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని విరాట్‌ను రిక్వెస్ట్ చేశామంటూ అంతకుముందు బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ చేసిన వ్యాఖ్యలకు ఇవి పూర్తి వ్యతిరేకం. విరాట్ కామెంట్స్‌తో సౌరవ్ గంగూలీతో పాటు బీసీసీఐ పెద్దలంతా ఇరకాటంలో పడ్డారు. దాంతో బీసీసీఐ పెద్దలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.అంతేకాకుండా బోర్డు, విరాట్ మధ్య అసలేం జరుగుతోందనే చర్చ కూడా మొదలైంది. ఇక కోహ్లీ ఫ్యాన్స్ అయితే గంగూలీ, జై షాలను విలన్‌గా చూపుతూ నెట్టింట ట్రోలింగ్‌కు దిగారు. సౌరవ్ గంగూలీపై ఉన్న గౌరవం పోయిందని, జై షా చేతిలో దాదా కీలు బొమ్మ అవుతాడని అస్సలు ఊహించలేదని ఘాటుగా విమర్శించారు.
#NationStandsWithDada ట్రెండింగ్..
అయితే సౌరవ్ గంగూలీకి అండగా నిలుస్తూ కొందరు అభిమానులు ట్విటర్ వేదికగా #NationStandsWithDada అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఈ క్యాంపైన్ ఉదయం మొదలవ్వగా.. సాయంత్రానికల్లా ఈ ట్వీట్ ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులు ఈ క్యాంపైన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఏది ఏం జరిగినా.. తామెప్పటికీ దాదా అభిమానులమేనని, ఈ దేశం మొత్తం అతనికి అండగా నిలుస్తుందని ట్వీట్ చేశారు. భారత క్రికెట్‌లోని సరికొత్త విప్లవం తీసుకొచ్చిన దాదా.. కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడని, మేటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకొచ్చాడని గుర్తు చేస్తున్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా సమూల మార్పులు తీసుకొస్తున్నాడని, త్వరలోనే వాటికి ఫలితాలు లభిస్తాయని పేర్కొంటున్నారు.
#WorldStandsWithKohli కూడా..
దాదాకు అండగా జరుపుతున్న క్యాంపైన్‌కు బదులుగా కోహ్లీ ఫ్యాన్స్ కూడా మరో క్యాంపైన్‌కు తెరలేపారు. దేశం మొత్తం గంగూలీకి అండగా ఉందని రోహిత్ ఫ్యాన్స్ అంటుంటే.. ఈ ప్రపంచమే కోహ్లీ వెనుకాల ఉందని బదులిస్తున్నారు. ఈ క్రమంలోనే #WorldStandsWithKohli అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. సౌరవ్ గంగూలీ కన్న కలలను కోహ్లీ చేసి చూపించాడని, కోహ్లీ రికార్డుల ముందు గంగూలీ దేనికి పనికిరాడని కామెంట్ చేస్తున్నారు. గంగూలీ ఈ దేశానికే స్టార్ అని, కానీ కోహ్లీ ఈ ప్రపంచం మొత్తానికి హీరోనని ట్వీట్ చేస్తున్నారు. గంగూలీ, జైషాలను కోహ్లీ తన బ్యాట్‌తోనే షూట్ చేయాలని కోరుతున్నారు.
రెండుగా విడిపోయిన కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్..
రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విభేధాలు లేవని కోహ్లీ ఎంత చెప్పినా.. అభిమానుల మాత్రం రెండుగా చీలిపోయి.. ట్విటర్ వేదికగా రచ్చచేస్తున్నారు. కోహ్లీ విషయంలో బీసీసీఐ కొంత సమయం వేచి చూడాలనుకుంటుంది. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇప్పుడే ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే అది టీమ్, ప్లేయర్ల కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తుందని, దానివల్ల సమస్య మరింత పెద్దది అవుతుందని భావిస్తోంది. అందుకే కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించడానికి గంగూలీ నిరాకరించాడట. టీమిండియా స్టార్ కెప్టెన్... ప్రెసిడెంట్ హోదాలో ఉన్న ఓ దిగ్గజ కెప్టెన్ వ్యాఖ్యలతో విభేదించిన సందర్భాలు గతంలో లేవు. దాంతో, కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత బీసీసీఐ పెద్దలంతా అతనిపై గుర్రుగా ఉన్నారట. కానీ, సమస్యను వెంటనే పరిష్కరించేందుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తే అది బెడిసికొడుతుందేమోనని భయపడుతున్నారట.
ఈ విషయంలో గంగూలీ, సెక్రటరీ జైషా సహా బీసీసీఐ పెద్దలంతా బుధవారమే జూమ్ కాల్‌లో మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. కోహ్లీ గురించి ఎలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొద్దని, మీడియాకు ఎలాంటి ప్రకటన ఇవ్వొద్దని అంతా మూకుమ్మడిగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications