Virat Kohli vs Joe Root: ఆ విషయంలో ఇంగ్లండ్ కెప్టెన్ కన్నా భారత సారథి ఎంతో బెటర్!

హైదరాబాద్: ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు అదరగొడుతుంది. న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ ఓటమి నేర్పిన పాఠాలు కోహ్లీసేన విజయానికి బాటలు వేసాయి. డబ్యూటీసీ రెండో ఎడిషన్‌లో భాగంగా ప్రారంభమైన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో కోహ్లీసేన ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టి 1-0తో లీడ్‌లో నిలిచింది. ఫస్ట్ టెస్ట్‌లో వర్షం కారణంగా విజయానికి అడుగు దూరంలో నిలిచిపోయిన భారత్.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో దుమ్మురేపింది.
ఓటమి అంచున నిలిచి స్పూర్తిదాయకమైన ఆటతీరుతో చిరస్మరణీయ విజయాన్నందుకుంది. అభిమానులకు అసలు సిసలు టెస్ట్ క్రికెట్ మజాను అందించింది. చివరి క్షణం వరకు మంచి రసపట్టు మీద సాగిన మ్యాచ్‌లో ఆటగాళ్ల మాటల యుద్దం, పోరాటం బ్లాక్ బస్టర్ మూవీ తలిపించాయి. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్ల కెప్టెన్ల పెర్ఫామెన్స్‌పై ఓ లుక్కెద్దాం.!

బ్యాటింగ్‌లో జోరూట్‌దే పై చేయి..
ఈ రెండు మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మన్‌గా జోరూట్ దుమ్మురేపాడు. ఫస్ట్ టెస్ట్‌లో (64, 109) హాఫ్ సెంచరీ, సెంచరీ బాదిన ఇంగ్లండ్ కెప్టెన్.. రెండో టెస్ట్‌లో(180 నాటౌట్, 33)అజేయ శతకంతో చెలరేగాడు. ఈ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో జోరూట్‌ను ఔట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసింది జోరూటే.
సొంతగడ్డపై అచ్చొచ్చిన పిచ్‌లపై జోరూట్ స్వేచ్చగా పరుగులు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టులో బ్యాటింగ్ బాధ్యతలు మోస్తుంది జోరూట్ ఒక్కడే. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఫస్ట్ టెస్ట్‌లో గోల్డెన్ డకౌట్ అయిన కోహ్లీ.. సెకండ్ టెస్ట్‌లో (42, 20) అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. 2014 ఇంగ్లండ్ పర్యటన నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాడు. క్రీజులో స్వేచ్చగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. శరీరానికి దూరంగా వెళ్లే బంతులను వెంటాడి మరీ ఔటవుతున్నాడు. బ్యాటింగ్ పరంగా కోహ్లీ కంటే జోరూటే ఎంతో మెరుగ్గా ఉన్నాడు.

కెప్టెన్సీ కింగ్ కోహ్లీనే..
బ్యాటింగ్‌లో విఫలమైనా కెప్టెన్‌గా మాత్రం విరాట్ కోహ్లీదే పై చేయి. భారత తుది జట్టు ఎంపిక దగ్గర నుంచి ఫీల్డింగ్ సెటప్, బౌలింగ్ వ్యూహాల వరకు అన్నింటిలోనే జోరూట్ కంటే కోహ్లీనే మెరుగ్గా కనిపించాడు. ముఖ్యంగా సెకండ్ టెస్ట్ రెండో రోజు విరాట్ తన మార్క్ కెప్టెన్సీని చూపించాడు. కెప్టెన్సీగా పనికిరాడనే వారికి తన వ్యూహాలు, ఖచ్చితమైన నిర్ణయాలతోనే సమాధానమిచ్చాడు.
చివరి రోజు ఆటలో భారత డిక్లేర్ చేసే విషయంలో కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. 250+ లీడ్ లభించినప్పటికీ.. అతను వ్యూహాత్మకంగా అడుగులు వేసాడు. టీ బ్రేక్ ముందు కాకుండా తర్వాత కొద్దిసేపటికే డిక్లేర్ ఇచ్చి తన మార్క్ కెప్టెన్సీని ప్రదర్శించాడు.

డిక్లేర్ నిర్ణయం సూపర్..
టీ బ్రేక్ ముందు డిక్లేర్ ఇస్తే ఇంగ్లండ్ ఓపెనర్లకు కావాల్సిన సమయం లభిస్తుందని భావించిన కోహ్లీ.. వ్యూహాత్మకంగా ఆ తర్వాత కొద్దిసేపటికే డిక్లేర్ ఇచ్చాడు. స్లోఓవర్ రేట్ సమస్యను అధిగమించేందుకు ఇంగ్లండ్‌కు ఇంకా 60 ఓవర్ల ఆట మిగిలుందనంగా డిక్లేర్ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో 10 నిమిషాల వ్యవధిలోనే మైదానంలోకి వచ్చిన ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరూ పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరారు. ఇది భారత్‌కు కలిసొచ్చింది.
ఆ తర్వాత కూడా బౌలర్లను మార్చే విషయంలోనూ.. ఫీల్డ్ సెటప్‌లోనూ కోహ్లీ స్పాట్ ఆన్‌గా వ్యవహరించాడు. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్‌ను రెచ్చగొడుతూ బౌలర్లను ఎంకరేజ్ చేసిన విధానం అద్భుతం. రివ్యూల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ.. లార్డ్స్ టెస్ట్‌లో మాత్రం అద్భుతం చేశాడు. సహచర ఆటగాళ్లు వద్దని వారిస్తున్నా.. బెయిర్ స్టో, ఓలీ రాబిన్సన్ విషయంలో రివ్యూకెళ్లి ఫలితం రాబట్టాడు.

దెబ్బతిన్న జోరూట్ వ్యూహాలు..
బ్యాటింగ్‌లో దుమ్మురేపిన జోరూట్.. కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు. భారత కీలక బ్యాట్స్‌మెన్‌ను త్వరగానే పెవిలియన్ చేర్చిన ఇంగ్లండ్.. బుమ్రా, షమీలను విడదీయలేకపోయింది. ఇక్కడ బుమ్రాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న వారి ఉద్దేశం కొంపముంచింది.
వికెట్ కోసం వెళ్లకుండా బుమ్రాను భయపెట్టాలని భావించి షార్ట్ పిచ్ బంతులతో దాడి చేసింది. కానీ బుమ్రా మరింత కసిగా ఆడి క్రీజులో పాతుకుపోయాడు. తమ తప్పిదం తెలుసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది.
పైగా రెండు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన జోరూట్ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. తుది జట్టు విషయంలోనూ తప్పిదాలు చేశాడు. భారత్ మాత్రం డబ్ల్యూటీసీ ఓటమి అనుభవంతో సరైన జట్టుతో బరిలోకి దిగింది. టీమ్ బ్యాలెన్స్ కోసం మంచి ఫామ్‌లో ఉన్న అశ్విన్‌నే పక్కనపెట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications