Kohli vs Anderson Fight: ఇది నీ అయ్య జాగిరా? ముసులోడివైనవుగా అందుకే ఇలా.. పూర్తి వీడియో!

లండన్: 'ఎవడు తీసిన గొయ్యిలో వాడే పడతాడు'అనే సామెత ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్‌ను కవ్వించి మరీ ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. మాతో పెట్టుకుంటే మడతడిపోద్దే అన్న తరహాలో చెలరేగిన భారత్ ఆటగాళ్లు చారిత్రాత్మక విజయాన్నందుకున్నారు. నిజానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 8 వికెట్లు కోల్పోయిన తర్వాత మరో వికెట్ తీసే లక్ష్యంతో బౌలింగ్ చేయకుండా బుమ్రా శరీరంపైకి బంతులు ఎక్కు పెట్టి పదే పదే షార్ట్ బంతులతో ఇబ్బంది పెట్టాలని ఇంగ్లండ్ ప్రయత్నించింది. తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్‌కు ఒక ఓవర్ బుమ్రా ప్రమాదకరంగా వేసినందుకు ప్రతీకారంగా అందరూ కలిసి పాఠం చెప్పాలని భావించినట్లున్నారు. కానీ క్రీజులో కుదురుకుపోయిన షమీ-బుమ్రా ఏకంగా 89 పరుగులు జోడించి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.

మూడో రోజు మొదలు..
ఈ టెస్టులో భారత ఆటగాళ్ల శారీరక భాష చూస్తే ప్రతీ ఒక్కరు ఒక్కో అగ్నిగోళంగా కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతీ క్షణం అమితోత్సాహంతో కనిపిస్తూ, తన సహచరులను ప్రేరేపించిన తీరు...వికెట్ పడినప్పుడు ప్రదర్శించిన హావభావాలు ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేసాయి. ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్లుగా క్రికెటర్లు మాటల దాడికి వెనుకాడలేదు. అండర్సన్‌తో కోహ్లీ వాదనే దీనికి నిదర్శనం. ఆట మూడో రోజు నుంచే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అండర్సన్‌ను బుమ్రా బౌన్సర్లతో ఇబ్బంది పెట్టాడు. తలకు, శరీరానికి తగిలేలా బంతులు వేసాడు.
కోహ్లీ X అండర్సన్..
అయితే అండర్సన్ ఔటవ్వగానే బుమ్రా.. అతని భుజం తడుతూ నవ్వుతూ ముందుకు వెళ్లిపోయాడు. దీనికి తీవ్ర ఆగ్రహానికి గురైన అండర్సన్ భారత పేసర్‌పై దుర్భషలాడాడు. ఇది మనసులో పెట్టుకున్న కోహ్లీ.. భారత ఇన్నింగ్స్ సందర్భంగా అండర్సన్‌కు బదులిచ్చాడు. బౌలింగ్ చేస్తూ పదే పదే పిచ్‌పై పరుగెడుతుండటంతో పాటు తనపై మాటల దాడికి దిగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భారత కెప్టెన్.. అదే తరహాలో చివాట్లు పెట్టాడు. 'బుమ్రాను తిట్టినట్లే నువ్వు నన్నూ తిడుతున్నావా? (ఓ బూతు మాట వాడుతూ) ఇదేమీ నీ అయ్య జాగిరి కాదు' అని కోహ్లీ కోపంగా అండర్సన్‌ను చూస్తూ అనడం స్టంప్ మైక్రో ఫోన్లో వినిపించింది. ఆ వెంటనే అండర్సన్.. మీరు కూడా నన్ను కావాల్సినంత తిట్టుకోవచ్చని బదులిచ్చాడు. దానికి మరింత ఆగ్రహానికి గురైన కోహ్లీ 'వయసు పెరగడం వల్లే నువ్విలా ప్రవరిస్తున్నావు' అని అన్నాడు.

పూర్తి వీడియో వైరల్..
జేమ్స్ అండర్సన్, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి స్పష్టత లేదు. కానీ తాజాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో బయటకు వచ్చింది.
కోహ్లీ, అండర్సన్ మధ్య సంభాషణ ఇలా
కోహ్లీ: ఏమిటి అది హా!.. బుమ్రాను తిట్టినట్లు మళ్లీ నన్ను తిడుతున్నావా? హా!
అండర్సన్: నువ్వు కూడా నన్ను కావాల్సినంత తిట్టుకో
కోహ్లీ: నువ్వు నీ సొంత రూల్స్ ప్రకారం ఆడుతున్నావు.. నన్ను బూతులు తిడుతున్నావు? నీ అయ్య జాగిరన్నట్లు పిచ్‌పై పరుగెడుతున్నావ్? హా!
అండర్సన్: నాకు తెలిసి బౌలర్లు క్రీజు వరకు పరుగెడుతారు..(వెటకారంగా)
కోహ్లీ: యే.. యే.. చిర్ప్.. చిర్ప్.. ముస్సలోడివయ్యావు కదా.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావ్!

అండర్సన్ జాగిరే..
ఈ వాగ్వాదంపై ఇంగ్లండ్ మరో పేసర్ స్టువర్ట్ బ్రాడ్ స్పందించాడు. కోహ్లీ స్లెడ్జింగ్‌కు ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య పోరు బాగుందని, కానీ కోహ్లీ వాడిన భాషే నచ్చలేదన్నాడు.
'కోహ్లీ.. లార్డ్స్ మైదానం అండర్సన్ జాగిరే. అది అతని అడ్డా. ఆ విషయం లార్డ్స్ రికార్డుల బోర్డు చెబుతుంది. కోహ్లీ దూకుడు నాకు నచ్చింది. కానీ అతను ఉపయోగించిన భాష మాత్రం చిక్కుల్లో పడేయవచ్చు' అని బ్రాడ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ కూటా నెట్టింట హల్‌చల్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 151 పరుగులతో ఘన విజయం సాధించి 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో బోణీ కొట్టిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications