Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat vs Babar: బాబర్ ఆజామ్ వ్యక్తిత్వం విరాట్ కోహ్లీకి పూర్తి వ్యతిరేకం! మాథ్యూ హెడ్‌న్‌పై ఇండియన్ ఫ్యాన్స్ ఫ

 Virat Kohli vs Babar Azam: Matthew Hayden Compares Both Memebers Stability

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌తో పోల్చుతూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ చేసిన వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు బాబర్‌తో కోహ్లీని పోల్చడానికి నువ్వేవరంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య పోలికే అనవసరమని మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందిస్తున్న మాథ్యూ హెడెన్.. ఆస్ట్రేలియాతో కీలక సెమీస్ పోరు ముందు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తమ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

కోహ్లీకి పూర్తి వ్యతిరేకం..

ఈ నేపథ్యంలోనే బాబర్ ఆజామ్‌ను విరాట్ కోహ్లీతో పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ వ్యక్తిత్వం కోహ్లీకి పూర్తి వ్యతిరేకమని చెప్పాడు. కోహ్లీ ఆట పట్ల పించితో పాటు అంకిత భావంతో ఉంటాడని, మైదానంలో దూకుడా ఉంటూ భావోద్వేగాలను అదుపు చేసుకోలేడని చెప్పాడు. కానీ బాబర్ మాత్రం ప్రశాంతంగా, నిరాడంబరంగా ఉంటాడని చెప్పాడు.'బాబర్ ఆజామ్ నిరాడంబరమైన వ్యక్తి. అతను చాలా స్థిరమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి. మైదానంలో బాబర్ అతి చేయడు. ప్రశాంతంగా ఉంటాడు. నన్నడిగితే అతని వ్యక్తిత్వం విరాట్ కోహ్లీకి పూర్తిగా వ్యతిరేకమని చెబుతా. కోహ్లీకి దూకుడెక్కువ. ఆట పట్ల అంకిత భావంతో ఉంటాడు. ఓటమిని ఏ మాత్రం సహించని వ్యక్తి. ఉద్వేగభరితంగా ఉంటాడు.'అని తెలిపాడు.

బంతిపి పిక్ చేయడంలో..

బంతిపి పిక్ చేయడంలో..

ఈ వ్యక్తితత్వమే బాబర్ సక్సెస్‌కు కారణమని ఈ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. 'బాబర్ గొప్ప నియంత్రణ కలిగిన వ్యక్తి. అద్భుతమైన టెంపర్‌మెంట్ ఉన్న మనిషి. బంతిని ఎదుర్కొనే విషయంలో అతనిది ప్రత్యేకమైన ప్రతిభ. అతనిలా సెకండ్ల వ్యవధిలో బంతిని పికప్ చేసే ఆటగాడిని చూడలేదు. అదే అతన్ని ప్రత్యేక ఆటగాడిగా నిలబెట్టింది. ముఖ్యంగా లైన్ అండ్ లెంగ్త్ బంతులను వేగంగా పిక్ చేయగలడు.'అని మాథ్యూ హెడెన్ చెప్పుకొచ్చాడు.

పాంటింగ్‌కు సెట్ అవుతాయి..

పాంటింగ్‌కు సెట్ అవుతాయి..

ఇక హెడెన్ వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు హెడెన్ కెప్టెన్ అయిన రికీ పాంటింగ్ సెట్ అయితాయని, భారత కెప్టెన్‌కు కాదని కామెంట్ చేస్తున్నారు. ఈ అతి చేసే విరాట్ కోహ్లే 70 సెంచరీలు చేశాడనే విషయం మర్చిపోవద్దని, అయినా స్లెడ్జింగ్‌తో మ్యాచ్‌లు గెలిచిన ఆటగాళ్లు ఇలా మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని చురకలంటిస్తున్నారు. అసలు బాబర్, కోహ్లీకి పోలిక తేవాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Thursday, November 11, 2021, 21:06 [IST]
Other articles published on Nov 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+