తన స్టైల్లో సచిన్‌కు విషెస్ చెప్పిన సెహ్వాగ్!!

హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేటి(ఏప్రిల్)తో 47వ వసంతలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా యావత్ భారతం మాస్టర్ బ్లాస్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టా ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ చూసినా సచినే కనిపిస్తున్నాడు. ఎవరీ స్టేటస్ చూసినా సచిన్ పేరే మారుమోగిపోతుంది. త్రోబ్యాక్ వీడియోలు.. సచిన్ రికార్డులు అయితే హల్‌చల్ చేస్తున్నాయి. సహచర ఆటగాళ్లు సైతం తమ ఆరాధ్య దైవానికి శుభాకాంక్షలు చెప్పారు. దీంతో సచిన్ పేరు ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
కాలాన్ని ఆపగలడు..
తన సహచర ఓపెనర్, విధ్వంసకర బ్యాట్స్‌మన్ సెహ్వాగ్ సచిన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పాడు. ‘ఇది నిజం. ఒక గొప్ప వ్యక్తి బ్యాటింగ్ చేస్తూ భారత్‌లో సమయాన్ని ఆపగలిగేవాడు. అయితే, సచిన్ కెరీర్‌లో అతిపెద్ద స్ఫూర్తి ఏదైనా ఉందంటే అది ఈ రెండు చిత్రాల్లోనే దాగి ఉంది. ప్రతీ కష్టం వెనుక ఓ విజయం ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దీన్ని తప్పకుండా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాపీబర్త్‌డే సచిన్'అంటూ 2007,2011 ప్రపంచకప్ నాటి ఫొటోలను సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
స్పూర్తిదాత హ్యాపీబర్త్‌డే..
‘క్రికెట్ ఆటపై ఉన్న మక్కువతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.'అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేయగా..
‘ తన బ్యాటింగ్‌తో మంత్రముగ్ధుల్ని చేసిన క్రికెట్ లెజెండ్ మాస్టర్ బ్లాస్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీ రికార్డుల వలే మీ జీవితం కూడా మరింత మెరవాలి.'అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు.
ప్రియమైన వ్యక్తికి...
‘సచిన్ తెందూల్కర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించండి.'అని బీసీసీఐ బాస్ సౌరభ్ గంగూలీ విష్ చేయగా..‘హ్యాపీబర్త్‌డే పాజీ. మీ కుటుంబంతో ఈ రోజును ఆస్వాదించండి. త్వరలోనే కలుస్తా. జాగ్రత్తగా ఉండండి. ఎంతో ప్రేమతో.. 'హర్భజన్‌సింగ్ ట్వీట్ చేశాడు. ‘ ప్రియమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఇలాగే స్ఫూర్తిప్రధాతగా నిలుస్తూనే ఉండాలి. మీరు చేసే ప్రతీ పనిలో అన్నీ విజయాలే సాధించాలి.' అని వీవీఎస్ లక్ష్మణ్ విష్ చేశాడు.
మీతో ఆడటం నా అదృష్టం..
‘జన్మదిన శుభాకాంక్షలు సచిన్ పాజీ. మీరెప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మీతో కలిసి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం నేను చేసుకున్న అదృష్టం. మరీ ముఖ్యంగా నా తొలి శతకంతో పాటు మీ వందో శతకం కూడా..'అని సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. ఇక బీసీసీఐ, రవిశాస్త్రి సైతం సచిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications