Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: పొలార్డ్‌పై కోహ్లీ సెటైర్స్.. పగలబడి నవ్విన రోహిత్! (వైరల్ వీడియో)

Virat Kohli Trolls Pollard For Sly Run-out Attempt On Rohit Sharma goes viral
IND vs WI : India 2-0 Lead In T20I Series,Rohit Lauds At Bhuvneshwar Kumar | Oneindia Telugu

కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన కీలక రెండో 20లో సమష్టిగా రాణించిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు.. 8 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. చాలా రోజుల తర్వాత ఓ సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు.మనుపటి తరహాలో బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు.

46 పరుగుల వద్ద భారీ సిక్స‌ర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అది కూడా పొడవాటి ఫీల్డర్ జేసన్ హోల్డర్ లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. అతని తలమీదుగా సిక్స్ కొట్టాడు. బంతిని క్యాచ్‌గా అందుకునేందుకు హోల్డర్ విఫలయత్నం చేశాడు. మ్యాచ్‌లో మంచి జోష్‌లో కనిపించిన విరాట్ కోహ్లీ.. తన బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించాడు. తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ సహచర ఆటగాళ్లను నవ్వించాడు.

ఈ క్రమంలోనే వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌పై కోహ్లీ ఫన్నీ సెటైర్ వేయగా.. రోహిత్ శర్మ పడి పడి నవ్వుకున్నాడు. విరాట్ కోహ్లీ అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డు అవడంతో ఆ సరదా ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే.. టీమిండియా ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ.. బంతిని మిడాన్ దిశగా బౌండరీ కోసం హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బౌలర్ ఛేజ్ వేగంగా స్పందించి ఆ బంతిని అడ్డుకోబోయాడు. అదే సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని రోహిత్ శర్మ అతడ్ని ఢీకొట్టకుండా ఉండేందుకు పక్కకి జరిగాడు. కానీ.. బంతి మాత్రం నేరుగా వెళ్లి రోహిత్ శర్మని తాకి వికెట్ల వైపు దూసుకెళ్లింది.

బౌలర్ రోస్టన్ ఛేజ్ ఆ బంతిని అందుకునే సమయానికి రోహిత్ శర్మ మళ్లీ క్రీజులోకి వచ్చేయగా.. ఛేజ్ మాత్రం రనౌట్ కోసం బంతిని వికెట్లపైకి విసిరాడు. కానీ.. గురి తప్పిన బంతి పిచ్ మధ్యలోకి వెళ్లింది. దాంతో.. మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ కీరన్ పొలార్డ్ అప్పటికే అక్కడికి చేరుకుని నెమ్మదిగా బంతిని అందుకుని రోహిత్ శర్మని రనౌట్ చేసే ఉద్దేశంతో బంతిని వికెట్లపైకి విసరబోయాడు.

కానీ.. రోహిత్ క్రీజులో ఉండటాన్ని ఆలస్యంగా గుర్తించి.. ఆ నిర్ణయాన్ని మార్చుకుని బౌలర్ ఛేజ్‌కి బంతిని ఇచ్చేశాడు. కీరన్ పొలార్డ్ చేష్టలన్ని అతని వెనుక నుంచి చూసిన కోహ్లీ.. ''రోహిత్‌ని అలా రనౌట్ చేయలేవు పొలార్డ్'' అంటూ కామెంట్ చేశాడు. కోహ్లీ మాటల్ని విన్న రోహిత్ శర్మ పకపకా నవ్వేయగా.. కీరన్ పొలార్డ్ లోలపల నవ్వుకున్నాడు.

Story first published: Saturday, February 19, 2022, 12:58 [IST]
Other articles published on Feb 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+