బుమ్రాను తీసుకోమని చెబితే.. ఈ వుమ్రాలు ఏం చేస్తారని కోహ్లీ ఎటకారంగా మాట్లాడాడు: పార్థివ్ పటేల్

న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో అతను సాధించిన ఘనతలే బుమ్రా ఏంటనే విషయం తెలియజేస్తాయి. వరల్డ్ టాప్ మోస్ట్ బౌలర్లలో అతను ఒకడు. ప్రస్తుత టీమిండియా వైస్ కెప్టెన్ కూడా అతనే. ముంబై ఇండియన్స్ తరఫున అనామక ఆటగాడిగా క్రికెట్ ప్రపంచానికి పరిచయమైన బుమ్రా.. అనతి కాలంలోనే వరల్డ్ బెస్ట్ బౌలర్‌గా ఎదిగాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 29 టెస్ట్‌లు ఆడిన బుమ్రా 123 వికెట్లు తీసాడు. 57 టీ20ల్లో 67 వికెట్లు పడగొట్టాడు. ఓ హ్యాట్రిక్‌తో భారత్ తరఫున అత్యంత వేగంగా 50 టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు.

కోహ్లీ సారథ్యంలోనే..
మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్ర చేసిన బుమ్రా.. స్టార్ పేసర్‌గా ఎదిగింది మాత్రం విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే. వీరి మధ్య బాండ్ కూడా బానే ఉంటుంది. ఆఫ్ ద ఫీల్డ్‌లో కూడా చాలా చనువుగా ఉంటారు. బుమ్రా బౌలింగ్ శైలి విరాట్ తరుచూ ఇమిటేట్ చేస్తూ నవ్విస్తుంటాడు. బుమ్రాతో ఇప్పుడు చాలా చనువుగా ఉంటున్న కోహ్లీ.. తొలి సారి అతని పేరు విన్నప్పుడు చాలా వెటకారంగా మాట్లాడట. ఈ విషయాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ ప్లేయర్, టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ తెలిపాడు.

బుమ్రా.. వుమ్రాలు ఏం చేస్తారు?
ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో క్రిక్ బజ్ షోలో మాట్లాడిన పార్థివ్.. బుమ్రా గురించి తొలిసారి విరాట్‌కు చెప్పినప్పుడు.. ఈ బుమ్రా.. వుమ్రాలు ఏం చేస్తారని చాలా వెటకారంగా మాట్లాడడని చెప్పాడు. '2014 ఐపీఎల్ సీజన్‌లో నేను ఆర్‌సీబీకే ఆడుతున్నాను. అప్పుడు ఒక అద్భుతమైన బౌలర్ ఉన్నాడని బుమ్రా గురించి విరాట్ కోహ్లీకి చెప్పాను. అతను మాత్రం బుమ్రా, వుమ్రాలు ఏం చేస్తారు? వదిలేయ్ భయ్యా అని ఎటకారంగా మాట్లాడాడు.'అని పార్థివ్ గుర్తు చేసుకున్నాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో గుజరాత్ కెప్టెన్‌గా ఉన్న తనకు బుమ్రా సత్తా గురించి బాగా తెలుసని, ఆ విషయమే విరాట్‌కు చెబితే అతను వినిపించుకోలేదన్నాడు.

చాలా హార్డ్ వర్క్..
'ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసే 2-3 ఏళ్ల ముందే గుజరాత్ తరఫున రంజీ ట్రోఫీ ఆడాడు. 2013 అతనికి అరంగేట్ర సీజన్. 2014లో అతను పెద్దగా రాణించలేదు. 2015లోనూ అతనికి కలిసి రాలేదు. సీజన్ మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది. కానీ ముంబై ఇండియన్స్ అతనికి అండగా నిలబడింది. అతను కూడా చాలా కష్టపడి బెస్ట్ బౌలర్‌గా ఎదిగాడు.'అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications