ఓయ్ కోహ్లీ.. చివరకు స్మిత్ కూడా సెంచరీ చేశాడు.. నీ సంగతేంది? ఏకిపారేస్తున్న ఫ్యాన్స్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానుల ట్రోలింగ్‌కు గురయ్యాడు. గత మూడేళ్లుగా సెంచరీ లేక నిలకడలేమి ఫామ్‌తో కోహ్లీ సతమతమవుతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. ఫార్మాట్, వేదికలు మారినా.. కోహ్లీ ఆట మాత్రం మారడం లేదు. ఐపీఎల్ 2022 సీజన్‌లో దారుణంగా విఫలమైన కోహ్లీ.. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ టెస్ట్‌లో చెలరేగుతాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.
18 నెలల తర్వాత
అయితే గత ఏడాదిన్నరగా సెంచరీ లేక ఇబ్బంది పడ్డ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా తన శతక కరువును తీర్చుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ సాధించాడు. 2020లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మూడో టెస్టులో చివరిసారి సెంచరీ అందుకున్న స్టీవ్ స్మిత్.. 18 నెలల తర్వాత టెస్టుల్లో మరో సెంచరీ నమోదు చేశాడు. స్టీవ్ స్మిత్‌కి టెస్టు కెరీర్‌లో ఇది 28వ సెంచరీ. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమిండియాపై సెంచరీ చేసిన జో రూట్... టెస్టుల్లో 28వ సెంచరీ నమోదు చేయగా, స్టీవ్ స్మిత్ అతని రికార్డును సమం చేశాడు.
మూడేళ్ల కిందట..
జో రూట్ 28వ టెస్టు సెంచరీ చేయడానికి 121 మ్యాచులు అవసరం రాగా, స్టీవ్ స్మిత్‌కి ఇది 87వ టెస్టు మ్యాచ్ మాత్రమే. వీళ్లిద్దరికంటే ముందే 2019 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో 27వ సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ మాత్రం గత రెండున్నరేళ్లుగా 28వ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోతున్నాడు. దాంతో అభిమానులు విరాట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. చివరకు స్మిత్ సైతం సెంచరీ చేశాడని, నీ సంగతేంది? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలానే ఆడితే ఫాబ్4లో నీ పేరు గల్లంతేనని ఘాటుగా విమర్శిస్తున్నారు.
ఆసీస్ 298/5
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్( 5), ఉస్మాన్ ఖవాజా(37) విఫలమవడంతో ఆస్ట్రేలియా 70 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ కలిసి మూడో వికెట్‌కి 134 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గట్టెక్కించారు. లబుషేన్( 156 బంతుల్లో 12 ఫోర్లతో 104) ఔటైనా.. స్టీవ్ స్మిత్ (212 బంతుల్లో 14 ఫోర్లతో 109 నాటౌట్), అలెక్స్ క్యారీ (35 బంతుల్లో 2 ఫోర్లతో 16 బ్యాటింగ్) అజేయంగా నిలిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications