దద్దరిల్లిన స్డేడియం..
ప్రేక్షకుల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుండటంతో మైదానం మొత్తం కోహ్లీ నామస్మరణతో దద్దరిల్లుతోంది. ఇక విరాట్ కోహ్లీ మైదానంలోకి వచ్చే సమయంలో ఈ సౌండ్ మరీ ఎక్కువైంది. మైదానంలోని ప్రేక్షకులంతా విరాట్ కోహ్లీకి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చప్పట్లతో స్వాగతం పలికారు. శ్రీలంక ఆటగాళ్లు సైతం విరాట్ కోహ్లీకి అభినందనలు తెలిపారు. ఇక సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీ పేరు మారుమోగుతుంది. ఎవరిని కదిలించినా కోహ్లీ పేరే వినిపిస్తుంది.
పాక్‌లోనూ ట్రెండింగ్..
భారత్‌లోనే కాదు.. శతృదేశమైన పాకిస్థాన్‌లోనూ విరాట్ కోహ్లీ అంటే పడి చచ్చే అభిమానులున్నారు. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ సందర్భంగా అతని పేరు పాకిస్థాన్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. పాకిస్థాన్ ట్విటర్ ట్రెండింగ్స్‌లో కోహ్లీ పేరు ఏడో స్థానంలో ఉండటం విశేషం. అక్కడ పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైనా.. చాలా మంది అభిమానులు భారత మ్యాచ్‌నే ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూస్తున్నారు.
100 కొట్టెనా?
100వ టెస్ట్‌లో విరాట్ సెంచరీ చేయాలని అందరూ కోరుకుంటున్నారు. 100వ టెస్ట్ మైలారాయికి గుర్తింపుగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ విరాట్ కోహ్లీకి స్పెషల్ మొమొంటోతో పాటు 100వ టెస్ట్ మ్యాచ్ క్యాప్ అందజేశాడు. సతీమణి అనుష్కశర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఈ సన్మానాన్ని స్వీకరించాడు. ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ కుటుంబ సభ్యులు, చిన్ననాటి కోచ్ కూడా హాజరయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, తొలి మూడు ఓవర్లు ఆచితూచి ఆడిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (29), మయాంక్ అగర్వాల్ (33) తర్వాత వేగం పెంచి ఆడారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం అందించారు.

నిలకడగా భారత్..
అయితే, లాహిరు కుమార వేసిన 10వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది జోరుమీద కనిపించిన రోహిత్ అదే ఓ ఓవర్‌లో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వన్ డౌన్ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన హనుమ విహారి.. మయాంక్ అగర్వాల్(33)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. కానీ, ఎంబుల్దెనియా వేసిన 19వ ఓవర్లో మయాంక్ ఔటై నిరాశపరిచాడు. దీంతో టీమిండియా 80 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆపై వందో టెస్టు ఆడుతున్న విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా.. 32 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 139 రన్స్ చేసింది. క్రీజులో హనుమ విహారి(45 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ(27) ఉన్నారు.


Click it and Unblock the Notifications
