IPL 2022: విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్.. అనుష్క శర్మకు ఆ సిగ్నల్! (వీడియో)

ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫీల్డింగ్‌తో అదరగొడుతున్నాడు. బ్యాటింగ్‌లో అంచనాలను అందుకోలేకపోతున్న విరాట్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. కళ్లు చెదిరే తన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతని సూపర్ క్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్(34) నిరాశగా వెనుదిరిగాడు. క్యాచ్ పట్టిన వెంటనే విరాట్ విజయం మనదే అంటూ గ్యాలరీలో ఉన్న తన సతీమణికి సిగ్నల్ ఇచ్చాడు.
అసలేం జరిగిందంటే..?
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ వేసిన 17వ ఓవర్‌లో తొలి బంతికి రెండు పరుగులు చేసిన రిషభ్ పంత్.. రెండో బంతికి కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. దాంతో తీవ్ర ఒత్తిడికి గురైన సిరాజ్ మూడో బంతిని లో ఫుల్ టాస్ రూపంలో విసరగా.. రిషభ్ పంత్ కవర్స్ దిశగా విరాట్ కోహ్లీ తలపై నుంచి బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు.
గంటకి 137కిమీ వేగంతో వచ్చిన ఆ బంతిని రిషబ్ పంత్ చక్కగా కనెక్ట్ చేయడంతో.. కోహ్లీ తలపై నుంచి బంతి బౌండరీకి వెళ్లేలా కనిపించింది. కానీ.. గాల్లోకి ఎగిరిన విరాట్ కోహ్లీ ఒంటిచేత్తో బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు.

మనదే విజయం అంటూ..
కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్‌కు రిషభ్ పంత్ బిత్తరపోయి నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు. కోహ్లీ మాత్రం ఆ క్యాచ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. స్టేడియంలోని గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ను వీక్షిస్తున్న అనుష్క శర్మ వైపు విక్టరీ సింబల్ చూపిస్తూ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 12 పరుగుల వద్దే రనౌటై తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. విరాట్ స్టన్నింగ్ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. పంత్ ఔటయ్యే సమయానికి ఢిల్లీ 22 బంతుల్లో 48 పరుగులే చేయాలి. పంత్ క్రీజులో ఉంటే ఆ పని పూర్తి చేసేవాడు.

కార్తీక్ విధ్వంసం..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' దినేశ్ కార్తీక్ (34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66 నాటౌట్) తన సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. మ్యాక్స్‌వెల్ (34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) అర్ధ సెంచరీ సాధించగా, షహబాజ్ (21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 32 నాటౌట్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడిపోయింది. వార్నర్ (38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు 66), రిషభ్ పంత్ (17 బంతుల్లో3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) మెరిశారు. బెంగళూరు బౌలర్లు హేజల్‌వుడ్ (3/28), సిరాజ్ (2/31) రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications