For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లీ! బుజ్జగిస్తున్న టీమ్ మేనేజ్‌మెంట్.. ఎందుకంటే?

Virat Kohli To Captain Royal Challengers Bangalore Again In IPl 2022 For These Reasons
IPL 2022 : Virat Kohli May Take Charge As RCB Captain Again ? Here Is the Reasons | Oneindia Telugu

హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లీనే ఉండాలా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కోహ్లీ సారథ్య బాధ్యతలు తీసుకుంటేనే జట్టుకు అని విధాల లాభం చేకూరుతుందని ఆ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఆ జట్టు చైర్మన్ ప్రద్మేశ్ మిశ్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. విరాట్ కోహ్లీ మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టేలా ప్రయత్నాలు చేస్తామని చెప్పాడు. అయితే ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే మళ్లీ కెప్టెన్‌గా ఉండేందుకు బలమైన కారణాలున్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

వేలంలో కలిసొస్తుంది..

వేలంలో కలిసొస్తుంది..

ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఉంటే ఆ జట్టుకు వేలంలో కలిసొచ్చే అవకాశం ఉంది. రిటెన్షన్ ప్రక్రియలో విరాట్ కోహ్లీ(రూ.15), గ్లేన్ మ్యాక్స్‌వెల్(రూ.11 కోట్లు), మహమ్మద్ సిరాజ్(రూ. 7 కోట్లు)లను మాత్రమే తీసుకున్న ఆర్‌సీబీ రూ.33 కోట్లే ఖర్చు పెట్టింది. ఇంకా ఆ జట్టు దగ్గర రూ.57 కోట్లు ఉన్నాయి. ఓ రకంగా వేలంలో ఇది మంచి అమౌంటే. కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే ఆ జట్టుకు వేలంలో సగం భారం తగ్గుతుంది. కెప్టెన్‌ను వెతుక్కోవాల్సిన పని ఉండదు. అప్పుడు మంచి ఆటగాళ్లను ఎంచుకునే వెసులుబాటు కలుగుతుంది. పైగా లీగ్‌లో రెండు, మూడు జట్లు కెప్టెన్ కోసం ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ఆర్‌సీబీ ఒక్క కెప్టెన్‌ ప్లేయర్‌కే భారీ డబ్బు చెల్లించాల్సి వస్తుంది.

ఆర్‌సీబీ ఫ్యాన్స్ సైతం..

ఆర్‌సీబీ ఫ్యాన్స్ సైతం..

ఐపీఎల్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఆర్‌సీబీనే. అందులో మెజార్టీ కోహ్లీ అభిమానులే. ఈ లెక్కన కోహ్లీ కెప్టెన్‌గా లేకుంటే వాళ్లంతా ఆర్‌సీబీ టైటిల్ గెలవాలని అస్సలు కోరుకోరు. ఎందుకంటే విరాట్ కెప్టెన్ కాకుండా మరే ఆటగాడి సారథ్యంలోనే ఆర్‌సీబీ టైటిల్ గెలిస్తే.. అది వాళ్లకి అవమానంగా మారుతుంది. కోహ్లీ కెప్టెన్‌గా తప్పుకోవడంతోనే ఆర్‌సీబీ టైటిల్ గెలిచిందనే మెసేజ్ వెళ్తోంది. ఇది వాళ్లకు తీవ్రని బాధను కలిగిస్తోంది. కోహ్లీ హేటర్స్‌కు సైతం అవకాశం దొరుకుతుంది. కాబట్టి కోహ్లీ కెప్టెన్‌గా ఉండటమే ఉత్తమం.

అనుభవం కూడా..

అనుభవం కూడా..

కెప్టెన్‌గా ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న విరాట్ కోహ్లీ జట్టు అడ్వాంటేజ్ అవుతాడు. సుదీర్ఘ కాలం ఆర్‌సీబీకి ఆడుతున్న విరాట్ కోహ్లీకి ఫ్రాంచైజీతో మంచి సంబంధాలున్నాయి. కొత్త కెప్టెన్ వస్తే అతను ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌తో కలిసిపోవడానికి కొంత సమయం పడుతుంది. అది జట్టు ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పైగా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా లేకుంటే టీమ్ క్రేజ్‌ కూడా తగ్గే ప్రమాదం ఉంది. కోహ్లీ ఫ్యాన్స్ అంతా టీమ్‌ను లైట్‌ను తీసుకునే అవకాశాలున్నాయి.

కోహ్లీ ఒప్పుకుంటాడా?

కోహ్లీ ఒప్పుకుంటాడా?

ఇక మళ్లీ సారథిగా కొనసాగేందుకు కోహ్లీ ఒప్పుకుంటాడా? అంటే అస్సలు ఒప్పుకోడు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అతను మళ్లీ వెనక్కి వెళ్లడు. అయితే టీమ్ స్టాటజీస్ దృష్ట్యా అంగీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే జట్టు కోసం తన కాంట్రాక్ట్‌నే రూ. 15 కోట్లకు తగ్గిచ్చుకున్న కోహ్లీ.. బలమైన టీమ్ కోసం మళ్లీ కెప్టెన్‌గా ఉండేందుకు వెనుకాడడు. జట్టుకు ప్రయోజనం చేరుతుందంటే అతను ఎంతటి బాధ్యతలనైనా స్వీకరిస్తాడు. పైగా అంతర్జాతీయ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడంతో అతనిపై ఎలాంటి ఒత్తిడి లేదు. దాంతో ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ విన్నపాన్ని అతను అంగీకరించే అవకాశం ఉంది.

Story first published: Thursday, February 3, 2022, 18:31 [IST]
Other articles published on Feb 3, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+