టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న కింగ్ కోహ్లీ.. న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ముంబైలోని వాంఖడే వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడింది.
బౌండరీతో పరుగుల ఖాతా తెరిచిన కోహ్లీ.. అనవసర పరుగుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ డైరెక్ట్ హిట్‌కు రనౌట్‌గా వెనుదిరిగాడు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంటాడుకున్న కోహ్లీ.. తన ఉరుకులాటతో టీమ్‌కు మరింత నష్టం చేశాడు.

అసలేం జరిగిదంటే..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్(138 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), డారిల్ మిచెల్(129 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81) న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. ఆకాశ్‌దీప్ ఓ వికెట్ తీసాడు.
అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో 4 వికెట్లకు 86 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(18) విఫలమైనా.. యశస్వి జైస్వాల్(30), శుభ్‌మన్ గిల్ ఆచితూచి ఆడారు. రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. తొలి రోజు ఆటలో మరో 4 ఓవర్లే మిగిలి ఉండగా యశస్వి జైస్వాల్ అనవసర స్వీప్ షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆ వెంటనే టీమిండియా మేనేజ్‌మెంట్ కోహ్లీ బ్యాటింగ్ పంపించకుండా మహమ్మద్ సిరాజ్‌ను నైట్ వాచ్‌మన్‌గా పంపించింది. అతను గోల్డెన్ డక్ అయ్యాడు. ఔటవ్వడమే కాకుండా ఒక రివ్యూను వృథా చేశాడు. దాంతో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ.. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో బౌండరీతో తన పరుగుల ఖాతా తెరిచాడు. ఆ మరుసటి బంతినే మిడాన్ దిశగా ఆడి కోహ్లీ క్విక్ సింగిల్‌కు ప్రయత్నించాడు.
ఆ దిశలోనే ఫీల్డింగ్ చేస్తున్న మ్యాట్ హెన్నీ వేగంగా బంతిని అందుకొని బౌలర్ ఎండ్‌వైపు వికెట్లను డైరెక్ట్ హిట్ చేశాడు. కోహ్లీ డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. దాంతో టీమిండియా 8 బంతులు 6 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. కోహ్లీ ఆ పరుగు తీయకుండా ఉండి ఉంటే తొలి రోజు ఆటలో టీమిండియాదే పైచేయి అయ్యేది. ప్రస్తుతం కోహ్లీ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్(38 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31 బ్యాటింగ్)తో పాటు రిషభ్ పంత్( 1 బ్యాటింగ్) ఉన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టాడు.
Matt Henry's direct hit catches Virat Kohli short 😯#INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/cL4RvUdMST
— JioCinema (@JioCinema) November 1, 2024