ఐసీసీ అవార్డులు: హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన కోహ్లీ (వీడియో)

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. మంగళవారం ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో మూడు అవార్డులను గెలుచుకున్న తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కోహ్లీ గెలుచుకున్నాడు.
టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా
దీంతో పాటు ఐసీసీ 2018 సంవత్సరానికి గాను ప్రకటించిన టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా కూడా కోహ్లీ ఎంపికయ్యాడు. గతేడాది కోహ్లీ వన్డేలు, టెస్టులు, టీ20.. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. స్వదేశంతో పాటు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ పరుగుల వరద పారించాడు.
ఐసీసీ అవార్డులు: చరిత్ర సృష్టించిన కోహ్లీ, ఎమర్జింగ్ ప్లేయర్‌గా పంత్
‘హ్యాట్రిక్ హీరో’ అంటూ ఐసీసీ ట్వీట్
దీంతో విరాట్ కోహ్లీ ‘హ్యాట్రిక్ హీరో' అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. 2018లో అన్ని ఫార్మాట్లు కలిపి 37 మ్యాచ్‌ల్లో 47 ఇన్నింగ్సులు ఆడిన కోహ్లి 68.37 సగటుతో 2,735 పరుగులు సాధించాడు. గతేడాది 55.08 యావరేజ్‌తో 1,322 పరుగులు సాధించిన కోహ్లి టెస్టు్ల్లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
తొలిసారి టెస్టు జట్టుకు కెప్టెన్‌గా
గతేడాది 13 టెస్టుల్లో 55.08 సగటుతో కోహ్లి 1322 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లాండ్, దక్షిమాఫ్రికా, ఆస్ట్రేలియా గడ్డలపై సెంచరీలు సాధించాడు. దీంతో విరాట్ కోహ్లీ తొలిసారి ఐసీసీ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక, వన్డేల్లోనూ పరుగుల వరద పారించడంతో ఐసీసీ వన్డే జట్టు కెప్టెన్‌గానూ కోహ్లీ ఎంపికయ్యాడు.
పదివేల పరుగుల మైలురాయిని సైతం
14 వన్డేల్లో 133.55 యావరేజితో 1202 పరుగులు చేసిన కోహ్లీ అత్యంత వేగంగా వన్డేల్లో పదివేల మైలురాయిని అధిగమించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. పది టీ20ల్లో 211 పరుగులు చేశాడు. దీంతో ఐసీపీ ప్రకటించిన అవార్డుల్లో కోహ్లీని మూడు అవార్డులు వరించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications