ఐసీసీ అవార్డులు: చరిత్ర సృష్టించిన కోహ్లీ, ఎమర్జింగ్ ప్లేయర్‌గా పంత్

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐసీసీ మూడు అత్యున్నత అవార్డులు గెలిచిన తొలి ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. 2018 సంవత్సరానికి గాను ఐసీసీ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కోహ్లి గెలుచుకున్నాడు.
దీంతో పాటు 2018 సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. గతేడాది అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ వోటింగ్ అకాడమీ కోహ్లీని రెండు జట్లకు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఐసీసీ వోటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు మీడియా, బ్రాడ్‌క్యాస్టర్స్ సభ్యులు మెంబర్లుగా ఉన్నారు. అయితే, ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో ఛటేశ్వర పుజారా చోటు దక్కించుకోలేకపోయాడు.
విరాట్ కోహ్లీ - టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఎంపిక
గతేడాది విరాట్ కోహ్లీ 55.08 యావరేజితో మొత్తం 1,322 పరుగులు చేశాడు. 13 టెస్టుల్లో ఐదు సెంచరీలు, 14 వన్డేల్లో ఆరు సెంచరీలు సాధించాడు. దీంతో ఐసీసీ వోటింగ్ అకాడమీలోని మెజారిటీ సభ్యులు రెండు జట్లకు కోహ్లీనే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో 2018ని విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ముగించిన సంగతి తెలిసిందే.

జస్ప్రీత్ బుమ్రా
కోహ్లీతో పాటు ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో జస్ప్రిత్ బుమ్రా చోటు దక్కించుకున్నాడు. గతేడాది అటు వన్డేలతో పాటు ఇటు టెస్టుల్లోనూ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకోవడంలో బుమ్రా కీలకపాత్ర పోషించాడు. ఈ సిరిస్‌లో బుమ్రా మొత్తం 21 వికెట్లు పడగొట్టాడు.
రిషబ్ పంత్..
గతేడాది టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసిన రిషబ్ పంత్.. అటు కీపింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ‘ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్ 2018'లో రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో ఓవల్‌లో వేదికగా జరిగిన ఐదో టెస్టులో పంత్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 20 క్యాచ్‌లు అందుకోవడంతో పాటు 350కిపైగా పరుగులు సాధించాడు. సిడ్నీ టెస్టులో పంత్ సెంచరీ సాధించడంతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్(వన్డే జట్టు)
రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్‌లు తమ అద్భుత ప్రదర్శనతో భారత జట్టు అనేక విజయాల్లో పాలుపంచుకున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరిస్‌లో భారత్ విజయం సాధించడంలో వీరిద్దరి పాత్ర ఎంతో కీలకం. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవడంలో కోహ్లి, పంత్, బుమ్రా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ టెస్టు జట్టు
ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్‌లో ముగ్గురు భారతీయలుు చోటు దక్కించుకున్నారు. కెప్టెన్ కోహ్లీతో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్, పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
టామ్ లాథమ్
కేన్ విలియమ్సన్
హెన్రీ నికోలస్(న్యూజిలాండ్)
కరుణరత్నే (శ్రీలంక)
కగిసో రబడా(దక్షిణాఫ్రికా)
నాథన్ లియోన్(ఆస్ట్రేలియా)
జాసన్ హోల్డర్(వెస్టిండీస్)
మహ్మద్ అబ్బాస్(పాకిస్తాన్)
ఐసీసీ వన్డే జట్టు
ఐసీసీ వన్డే జట్టులో నలుగురు భారతీయులు ఉన్నారు. కెప్టెన్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలకు చోటు లభించింది.
రోహిత్ శర్మ(ఇండియా)
బెయిర్ స్టో(ఇంగ్లాండ్)
విరాట్ కోహ్లీ(ఇండియా)(కెప్టెన్)
జో రూట్ (ఇంగ్లాండ్)
రాస్ టేలర్(న్యూజిలాండ్)
జోస్ బట్లర్(ఇంగ్లాండ్)(వికెట్ కీపర్)
బెన్ స్టోక్స్(ఇంగ్లాండ్)
మష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్)
రషీద్ ఖాన్(ఆప్ఘనిస్థాన్)
కుల్దీప్ యాదవ్(ఇండియా)
జస్ప్రీత్ బుమ్రా(ఇండియా)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications