షమీ ట్రోలింగ్‌ను తప్పుబట్టడమే కోహ్లీ కొంపముంచిందా? భారత కెప్టెన్‌పై బీజేపీ ఆగ్రహానికి ఇదే కారణమా?

న్యూఢిల్లీ: వన్డే కెప్టెన్సీ మార్పు భారత క్రికెట్‌లో అగ్గిని రాజేసింది. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. మొత్తానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మధ్య గ్యాప్ ఏర్పడిందనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదనే విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించామని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఇటీవల తెలిపాడు. టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవద్దని కోహ్లీకి ఎంత చెప్పినా వినలేదన్నాడు. పర్సనల్‌గా తాను కూడా కోహ్లీని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశానని చెప్పాడు. మరోవైపు కెప్టెన్సీ మార్పుతో ఆగ్రహంగా ఉన్న విరాట్ కోహ్లీ.. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడని, సౌతాఫ్రికా పర్యటనలోని వన్డే సిరీస్ సమయంలో తనకు రెస్ట్ కావాలని బోర్డును కోరాడనే పుకార్లు షికారు చేశాయి.
గంగూలీని ఇరికిస్తూ...
అయితే ఈ వార్తలన్నిటికీ క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. సౌరవ్ గంగూలీ విషయంలో బాంబు పేల్చాడు. సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బుధవారం మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. వన్డే సిరీస్‌కు దూరంగా ఉంటానని వచ్చిన వార్తల్లో నిజం లేదన్నాడు. మూడు వన్డేల సిరీస్‌కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఇక రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విబేధాల్లేవని, గత రెండున్నరేళ్లుగా ఇదే విషయం చెబుతున్నానని తెలిపాడు. ఇక టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవద్దని తనను ఎవరు కోరలేదని, వన్డే, టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగుతానని తాను స్పష్టంగా చెప్పానని తెలిపాడు. కానీ టీ20 కెప్టెన్సీ వదులుకుంటే వన్డే సారథ్యం నుంచి కూడా తప్పిస్తామని తనకు ఎవరు చెప్పలేదని, ఐసీసీ ట్రోఫీలు గెలవనందుకే ఈ నిర్ణయం తీసుకున్నారేమోనని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ వ్యాఖ్యలతో గంగూలీ చెప్పింది అవాస్తవమని తేలింది.

షమీపై ట్రోలింగ్‌ను తప్పుబట్టడంతోనే..
అయితే విరాట్ కోహ్లీ పట్ల బోర్డు ఒక్కసారిగా ఇంత వ్యతిరేకత పెంచుకోవడానికి చాలా కారణాలున్నాయని తెలుస్తోంది. టీమ్ సెలెక్షన్ విషయంలో మొదలైన ఈ రగడ కొనసాగుతూ వచ్చిందంట. అయితే కోహ్లీ ప్రెస్ మీట్ తర్వాత మరో వాదన తెరపైకి వచ్చింది. టీ20 ప్రపంచకప్ సందర్భంగా మహమ్మద్ షమీపై జరిగిన దారుణమైన ట్రోలింగ్‌ను విరాట్ కోహ్లీ తప్పుబట్టడం అతని కొంపముంచిందనే ప్రచారం జరుగుతోంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఓటమి అనంతరం సోషల్ మీడియా వేదికగా మహమ్మద్ షమీపై జరిగిన ట్రోలింగ్ విరాట్ కోహ్లీ బహిరంగంగా ఖండించాడు. ప్రెస్ మీట్‌లో ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. అవి వెన్నెముక లేని వెదవల పిచ్చి కూతలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ స్టార్ ప్లేయర్‌ను మతం పేరిట దూషించడం అమానుషమని మండిపడ్డాడు. ఇలాంటి పిచ్చి కూతలకు సోషల్ మీడియా వేదిక కావడం చూస్తుంటే బాధగా ఉందన్నాడు. మహమ్మద్ షమీకి జట్టు మొత్తం అండగా ఉందని తెలిపాడు.

బీసీసీఐ వద్దని చెప్పినా..
అయితే ఈ ప్రెస్ మీట్‌కు ముందు విరాట్ కోహ్లీకి బీసీసీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయంట. ఎట్టి పరిస్థితుల్లో షమీ ట్రోలింగ్‌ను ప్రస్తావించవద్దని బీసీసీఐ పెద్దలు కోహ్లీకి సూచించారట. కానీ ఈ విషయం పట్టించుకోని కోహ్లీ.. ట్రోలింగ్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆకతాయిలను మందలించాడు. అయితే కోహ్లీ చేసిన పని.. అటు బీసీసీఐ.. ఇటు దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి ఏ మాత్రం నచ్చలేదట. షమీపై ట్రోలింగ్‌ను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఖండించడంతో.. ఈ వ్యవహారంపై అప్పట్లో రాజకీయంగా దుమారం రేగింది. బీజేపీ సపోర్టర్సే ఈ ట్రోలింగ్‌కు దిగారనే ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలోనే కోహ్లీని ఈ విషయాన్ని ప్రస్తావించి ఈ వివాదాన్ని పెద్దది చేయవద్దని బీజేపీ సూచనలతో బీసీసీఐ పెద్దలు ఆదేశించినట్లు అప్పట్లో కూడా వార్తలు వచ్చాయి.
జై షా సీరియస్..
బీసీసీఐ పెద్దలు ఎంత చెప్పినా కోహ్లీ వినకపోవడం సెక్రటరీ జైషాకు ఏ మాత్రం నచ్చలేదట. దాంతోనే కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని జైషా పట్టుబట్టాడని ప్రచారం జరుగుతుంది. ఇక సౌరవ్ గంగూలీ సైతం బీసీసీఐలో కీలు బోమ్మలా మారడని, మొత్తం జై షా రాజ్యం నడుస్తుందనే వాదన వినిపిస్తోంది. అమిత్ షా కొడుకైన జై షాకు బీసీసీఐ ఆఫిస్ బేరర్స్, అధికారులంతా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అతను చెప్పిందే వేదమైందని పలువురు సీనియర్ జర్నలిస్ట్‌లు సైతం అంగీకరిస్తున్నారు. జై షా, గంగూలీ ఇద్దరు భారత క్రికెట్‌ను నాశనం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications