Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో సెంచరీతో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన జోరు కొనసాగిస్తున్నాడు. టీ20, టెస్ట్ ఫార్మాట్స్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ.. తనకు అచ్చొచ్చిన వన్డేల్లో మాత్రం తనదైన బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. పాత కోహ్లీని తలపిస్తూ పరుగుల మోత మోగిస్తున్నాడు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కింగ్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఈ శతకంతో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

వన్డే ఫార్మాట్‌లో వరుసగా రెండు, అంతకంటే ఎక్కువ శతకాలు అత్యధిక సార్లు నమోదు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ మొత్తం 11 సందర్భాల్లో వరుసగా రెండు, అంతకంటే ఎక్కువ శతకాలు నమోదు చేశాడు. అతని తర్వాత ఏబీ డివిలియర్స్ 6 సార్లు ఈ ఫీట్ సాధించాడు.

వన్డేల్లో సౌతాఫ్రికాపై వరుసగా మూడు శతకాలు నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023లో కోల్‌కతా వేదికగా (101*) సెంచరీ బాదిన కోహ్లీ.. రాంచీ వేదికగా జరిగిన గత వన్డేలో 135, తాజాగా రాయ్‌పూర్‌లో 101 పరుగులు చేశాడు. వన్డే ఫార్మాట్‌లో 53 శతకాలు నమోదు చేశాడు. ఓవరాల్‌గా విరాట్ కోహ్లీకి ఇది 84వ సెంచరీ కాగా.. సెంచరీ తర్వాత అత్యధిక శతకాలు బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. సొంతగడ్డపై అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్‌గానూ కోహ్లీ చరిత్రకెక్కాడు.

Virat Kohli Smashes Consecutive Centuries Edges Closer to Tendulkar s Legendary Record

రోహిత్ శర్మ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన కింగ్ కోహ్లీ.. సిక్సర్‌తో తన పరుగుల ఖాతా తెరిచాడు. రుతురాజ్ గైక్వాడ్‌తో సమయోచితంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్స్, సింగిల్స్, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

47 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న కోహ్లీ మరో 43 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. కెరీర్‌లో ఓవరాల్‌గా 84వ శతకం సాధించిన కింగ్ కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ 100 శతకాల రికార్డ్‌కు 16 సెంచరీల దూరంలో ఉన్నాడు. అతను ఇదే జోరు కొనసాగించి వన్డే ప్రపంచకప్ 2027 వరకు జట్టులో కొనసాగితే సచిన్ రికార్డ్ కనుమరుగయ్యే అవకాశం ఉంది. కోహ్లీతో పాటు రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది.

Story first published: Wednesday, December 3, 2025, 17:08 [IST]
Other articles published on Dec 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+