కోహ్లీ విధ్వంసం.. 74 బంతుల్లో సెంచరీ, వన్డేల్లో మరో ప్రపంచ రికార్డు!
Virat Kohli: వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే కరేబియన్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన కోహ్లీ.. కేవలం 74 బంతుల్లోనే తన అద్భుతమైన సెంచరీని పూర్తి చేశాడు. కింగ్ కోహ్లీ దూకుడు ఇన్నింగ్స్ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించింది.
55వ వన్డే సెంచరీ
వన్డేలలో విరాట్ కోహ్లీకి ఇది 55వ సెంచరీ కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 86వది. దీనితో వన్డేలలో అత్యధిక సెంచరీల కోసం తాను నెలకొల్పిన ప్రపంచ రికార్డును విరాట్ కోహ్లీ మరింత పటిష్టం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీల సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుకు కోహ్లీ ఇప్పుడు మరింత చేరువయ్యాడు.

15 వేల రన్స్ పూర్తి చేసిన కోహ్లీ
ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లో విరాట్ మరో ప్రధాన మైలురాయిని సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో 59వ పరుగు వద్ద కోహ్లవీ వన్డే క్రికెట్‌లో 15,000 పరుగుల మ్యాజికల్ మార్క్‌ను అధిగమించాడు. కింగ్ కోహ్లీ తన 315వ మ్యాచ్‌లో (303 ఇన్నింగ్స్‌లలో) ఈ మైలురాయిని చేరుకుని, వన్డే చరిత్రలో 15,000 పరుగులు సాధించిన అత్యంత వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు.
18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్
2008లో అరంగేట్రం చేసినప్పటి నుంచి విరాట్ కోహ్లీ 18 ఏళ్ల ప్రయాణం సాటిలేని విజయాలతో నిండిపోయింది. మూడు ఫార్మాట్లలోనూ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ నిరంతరం కొత్త ప్రమాణాలను నెలకొల్పాడు. టెస్టుల్లో 30 శతకాలు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఒక శతకం, ఇప్పుడు వన్డేలలో 55 శతకాలతో విరాట్ కెరీర్ ఆధునిక యుగపు గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


