For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli మూడేళ్లుగా సెంచరీ చేయకపోతేనేం.. 24 హాఫ్ సెంచరీలు బాదాడు!

 Virat Kohli slams 24 fifties after his last international century

హైదరాబాద్: 'నాన్న విరాట్ కోహ్లీ ఎవరు.. అతని చెత్త ప్రదర్శన కూడా ఇతర ఆటగాళ్ల బెస్ట్ కంటే గొప్పగా ఉంటుంది బిడ్డా.' సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న మీమ్. కోహ్లీ పేలవ ఫామ్ నేపథ్యంలో జోరుగా సాగుతున్న చర్చలో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న సెటైర్. అవును అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ నెలకొల్పిన ప్రమాణాలు అలాంటివి. గత మూడేళ్లగా విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో ఒక్క సెంచరీ కూడా చేయని మాట నిజం. కానీ మూడు ఫార్మాట్లలో కలిపి అతను 24 హాఫ్ సెంచరీలు చేశాడనేది కూడా అంతే వాస్తవం. భారత జట్టులో మరే బ్యాటర్ కూడా కోహ్లీ కంటే మెరుగ్గా ప్రదర్శన చేయలేదు. అయినా కోహ్లీలో ఫామ్‌లో లేడు. అతన్ని జట్టు నుంచి తప్పించాలి. గత వారం రోజులుగా వినిపిస్తున్న విమర్శలు.

24 హాఫ్ సెంచరీలు..

సెంచరీల మోత మోగించిన విరాట్ ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఓ స్థాయిని ఏర్పరచుకున్నాడు. దాంతోనే గత మూడేళ్లుగా అతను హాఫ్ సెంచరీలతో పరుగులు చేస్తున్నా అవి ఎవరికి పెద్దగా కనిపించడం లేదు. స్థాయికి తగ్గ ప్రదర్శనలా అనిపించడం లేదు. ఆ క్రమంలోనే విరాట్‌పై నోరుపారేసుకుంటున్నారు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై చివరి సెంచరీ బాదిన విరాట్ ఆ తర్వాత మొత్తం 24 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇందులో 85 పరుగులకు పైగా 6 సార్లు చేశాడు. వెస్టిండీస్‌తో 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ 24 హాఫ్ సెంచరీలకు సంబంధించిన వీడియోలను రతన్ దీప్ అనే ట్విటర్ యూజర్ పంచుకున్నాడు.

విరాట్ బ్యాడ్ లక్ అంతే..

ఈ వీడియోలను చూసిన అభిమానులు విరాట్ కోహ్లీ అండగా నిలుస్తున్నారు. విరాట్ అసలు ఏ మాత్రం ఫామ్ కోల్పోలేదని, అతని బ్యాటింగ్‌లో రిథమ్ అలానే ఉందని కామెంట్ చేస్తున్నారు. చాలా మ్యాచ్‌ల్లో విరాట్ దురదృష్టవశాత్తు పెవిలియన్ చేరాడనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో విరాట్ హాఫ్ సెంచరీ సాధించాడని, అంతా విఫలమైన వేళ అతను ఆకట్టుకున్నాడని కామెంట్ చేస్తున్నారు.

భారీ అంచనాల వల్లనే..

భారీ అంచనాల వల్లనే..

కోహ్లీ 2019 నవంబర్‌లో తన ఆఖరి సెంచరీ బాదాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అతని 70 సెంచరీలు పూర్తయ్యాయి. మరొక్క సెంచరీ చేస్తే రికీ పాంటింగ్‌ (71)ను సమం చేస్తాడు. గతంలో ఉన్న ఫామ్‌ను కొనసాగిస్తూ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ సచిన్‌ సెంచరీల రికార్డు (100) కూడా అలవోకగా సమం చేయగల సత్తా ఉందని అంతా కోహ్లీపై అంచనాలు పెంచేసుకున్నారు. కోహ్లీ 71వ సెంచరీ ఫ్యాన్స్‌ను ఊరిస్తోంది. అయితే అది ఇప్పటి వరకు రాలేదు! దాంతో అదే అసహనం సోషల్‌ మీడియా వేదికగా విశ్లేషకులు, మాజీ ఆటగాళ్ల ద్వారా విమర్శగా మారింది.

Story first published: Sunday, July 17, 2022, 14:35 [IST]
Other articles published on Jul 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+