Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS:పాపం బుమ్రా.. విరాట్ కోహ్లీ ఓవరాక్షన్‌‌‌కు బలి!(వీడియో)

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌‌‌లో ఆ జట్టు అరంగేట్ర ప్లేయర్ కోన్‌స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన 19 ఏళ్ల సామ్ కోన్‌స్టాస్.. ఎలాంటి బెరుకు లేకుండా బ్యాటింగ్ చేశాడు.

ముఖ్యంగా వరల్డ్ క్లాస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా‌పై ర్యాంప్ షాట్స్‌తో విరుచుకుపడ్డాడు. 2021 నుంచి టెస్ట్‌ల్లో ఒక్క సిక్స్ కూడా ఇవ్వని బుమ్రా.. సామ్ కోన్‌స్టాస్‌ రివర్స్ స్కూప్ షాట్స్ ధాటికి ఈ మ్యాచ్‌లో సమర్పించుకున్నాడు. దాదాపు 4,483 బంతుల తర్వాత బుమ్రా బౌలింగ్‌లో సిక్స్‌ నమోదైంది. అటాకింగ్ గేమ్‌తో బుమ్రాను బ్యాక్ ఫుట్‌లో పెట్టిన సామ్ కోన్‌స్టాస్.. మిగతా బౌలర్లపై కూడా అదే రీతిలో విరుచుకుపడ్డాడు.

Virat Kohli slammed for bumping into Sam Konstas Leads To Heated Clash On Field Video

దాంతో సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ.. ఈ 19 ఏళ్ల కుర్రాడిని కవ్వించే ప్రయత్నం చేశాడు. ఓవర్ మధ్యలో అతనికి ఎదురుగా నడిచిన కోహ్లీ.. సామ్ కోన్‌స్టాస్ భుజాన్ని బలంగా ఢికోట్టాడు. ఆ తర్వాత అతనిపై నోరు పారేసుకున్నాడు. ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు జోక్యం చేసుకొని గొడవ జరగకుండా చూసుకున్నారు. కోహ్లీ కవ్వింపులకు సామ్ కోన్‌స్టాస్ బ్యాట్‌తోనే బదులిచ్చాడు.

ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కోహ్లీ కవ్వింపుల తర్వాత బుమ్రా వేసిన 11వ ఓవర్‌లో కోన్‌స్టాస్ వరుసగా 4, 0, 2, 6, 4, 2 బాది 18 పరుగులు పిండుకున్నాడు. విరాట్ కోహ్లీ ఓవరాక్షన్ కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా బలయ్యాడు. 19 ఏళ్ల కుర్రాడి పట్ల కోహ్లీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కోహ్లీపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మ్యాచ్ ఫీజులో కోతతో పాటు ఓ డీ మెరిట్ పాయింట్ కూడా విధించవచ్చు. వరల్డ్ బెస్ట్ బ్యాటర్ అయిన కోహ్లీ.. అరంగేట్ర ప్లేయర్ ఆటను అభినందించాల్సింది పోయి.. కవ్వింపులకు పాల్పడటం సరికాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు కోహ్లీ అభిమానులు మాత్రం అతనికి అండగా నిలుస్తున్నారు. 19 ఏళ్ల కుర్రాడైన ప్రత్యర్థి ఆటగాడేనని, జట్టు విజయం కోసం కొన్ని సార్లు మైండ్ గేమ్ కూడా ఆడాల్సి ఉంటుందని, కోహ్లీ అదే చేశాడని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Story first published: Thursday, December 26, 2024, 10:20 [IST]
Other articles published on Dec 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+